వంశీ దర్శకత్వంలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవలే విదేశాల్లో మరో షెడ్యూల్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత రామ్‌చరణ్ 13వ చిత్రానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌తో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం వుంటుందట. ఇటీవలే వంశీ చరణ్‌కు కథ విన్పించాడని, కథ నచ్చడంతో ప్రొసీడ్ అవ్వమని చెప్పాడట. మహేష్ సినిమా పూర్తికాగానే చరణ్‌తో సినిమా వుంటుందట. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే వచ్చిన ‘ఎవడు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.