ఆంధ్రప్రదేశ్‌

ఎడ్యుకేషన్ హబ్‌గా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) సెప్టెంబర్ 7: నవ్యాంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హాబ్‌గా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ 25 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారని మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి అసెంబ్లీ వర్షకాలపు సమావేశాలలో శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనససభ్యులు ‘రాష్ట్రంలో పడిపోతున్న విద్యా ప్రమాణాలపై’ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలు దిగజారాయని కొంత మంది సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంపై కొంత వరకు ఏకీభవిస్తానని అన్నారు. విద్యా రంగంలో దేశంలో 17వ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ను 3వ స్థానంలో నిలబెట్టామన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామన్నారు. 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు పోటీపడగా అందులో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి నియమించామన్నారు. ఆంధ్ర యూనివర్శిటిలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్ రెడ్డి రాష్ట్రంలో పడిపోతున్న విద్యా ప్రమాణాలపై మాట్లాడుతూ తాను ఒక పాఠశాలను తనిఖీ చేయగా ఇద్దరూ విద్యార్థులను ‘కమిటీ’ అనే పదానికి ఇంగ్లీషులో స్పెల్లింగ్ రాయమని అడిగితే ఒక అక్షరం తప్పుగా రాశారన్నారు. అదే పదానికి టీచర్‌ను స్పెల్లింగ్ రాయమని తాను కోరగా రెండు అక్షరాలు తప్పుగా రాశారన్నారు. దీంతో విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా వున్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, ప్రాథమిక స్ధాయి విద్య నుండి ఉన్నత స్థాయి విద్య వరకు ఉపాధ్యాయలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని మంత్రికి సూచించారు. ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారులు మంచిగా పనిచేసిన జిల్లాల్లో మాత్రమే విద్యా ప్రమాణాలు బాగున్నాయని, సరిగా పనిచేయని చోట విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని అన్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్శిటీలో ఖాళీగా వున్న సుమారు 1700 పోస్టులను భర్తీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకోచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తెలంగాణలో పనిచేస్తున్న 440 మంది మన ఉపాధ్యాయులను ఆంధ్రాకు తీసుకురావాలని మంత్రిని కోరారు.
పీఈటీల స్థాయి పెంచుతాం
వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు రాష్ట్రంలోని 12వేల 827 భాషా పండిత, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల స్థాయిని పెంచుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం శాసనసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యుడు చాంద్ బాషా అడిగిన ఓ ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిస్తూ 2009 మార్చి 2వ తేదీన జారీ అయిన జీవో 80 ద్వారా 1500 బాషా పండితుల పోస్టులను, అలాగే 500 వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులను పాఠశాల సహాయకులుగా స్థాయికి పెంచామన్నారు. తిరిగి 2016 ఆగస్టు 2వ తేదీ జారీ అయిన జీవో 144 ద్వారా 1450 భాషా పండిత్ గ్రేడ్-2 పోస్టులను, 1200 పీఈటీ పోస్టులను పాఠశాల సహాయకులుగా స్థాయి పెంచామన్నారు.