ఆంధ్రప్రదేశ్‌

విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 7: రాష్ట్రంలో విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం ఒకటో బ్లాకు మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు బృందం, విద్యుత్, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు పనులపై సీఎస్ సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదేళ్ల (2015-20) కాలపరిమితితో చేపట్టిన ఈప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2220 కోట్లు. ఈ ప్రాజెక్టు నిబంధనలు, మార్గదర్శకాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణం, విస్తరణ, విద్యుత్, మురుగునీటి కాలువల నిర్మాణం, విశాఖలోని కైలాసగిరి హిల్ ప్రాజెక్టు, విశాఖ జూలాజికల్ పార్కు, కంబాలకొండ ఎకో పార్కు, నిర్మాణ నాణ్యతలు, కన్సల్టింగ్ ఏజెన్సీలు, భూగర్భ కేబుల్ పనులు, టెండర్లు, బిల్లుల చెల్లింపు, నిధుల వినియోగం, బీమా తదితర అంశాలను సమీక్షించారు. వివిధ విభాగాల్లో జరిగిన పనుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నిర్ణీత కాలంలో ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. ప్రపంచబ్యాంకు బృందానికి అభినందనలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు జి అనంతరాము, కె కరికాల వలవన్, కెఎస్ జవహర్‌రెడ్డి, ఐజీపీ రాజీవ్‌కుమార్ మీనా, ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు టాస్క్ఫోర్స్ టీము లీడర్, దీపక్ సింగ్, నేహా వ్యాప్ తదితరులు పాల్గొన్నారు.