రాష్ట్రీయం

సైబర్ నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుత్నునట్టు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ వెల్లడించారు. విశాఖలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ ల్యాబ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల కిందట విజయవాడలో క్రైబర్ ఇనె్వస్టిగేషన్ ల్యామ్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్‌లో ఏడు సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ ట్రైనింగ్ సెంటర్, ల్యాబ్‌లు నెలకొల్పనున్నామని ఆయన చెప్పారు. ఇటువంటి ట్రైనింగ్ సెంటర్లను త్వరలోనే రాజమండ్రి, కర్నూలు, తిరుపతిలో ప్రారంభించనున్నామని చెప్పారు. అనంతపురం, విజయవాడల్లో సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ ట్రైనింగ్‌తోపాటు సైబర్ నేరాల అనాలసిస్ ల్యాబ్స్ ప్రారంభిస్తామని ఠాకూర్ వెల్లడించారు. సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ సెంటర్ ప్రాంతీయ కార్యాలయాలకు అనలసిస్ కిట్స్ అందించనున్నామని చెప్పారు. అతి పెద్ద సైబర్ నేరాలను చేధించేందుకు ఈ కిట్స్ ఉపయోగపడతాయని ఆయన తెలియచేశారు. ఒక్కో సైబర్ ఇనె్వస్టిగేషన్ పోలీస్ స్టేషన్‌లో ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక హెచ్‌సీలు, 12 మంది కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్ ఉంటారని చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో సోషల్ మీడియా నేరాలు, వీడియో నేరాలు, పాస్‌వర్డ్ నేరాలపై పరిశోధన జరుగుతుందని ఠాకూర్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సైబర్ నేరాలు 20 శాతం చొప్పున పెరుగుతున్నాయని అన్నారు. 2016 సంవత్సరంలో 442 సైబర్ నేరాలు నమోదైనాయి. ఇందులో మూడు కోట్ల రూపాయల నష్టం జరిగితే, కేవలం 0.18 కోట్లను మాత్రమే రికవరీ చేయగలిగామని అన్నారు. 2017లో 581 కేసులు నమోదైనాయని ఇందులో ఆరు కోట్ల రూపాయల నష్టం జరగగా, 2.6 కోట్ల రూపాయలను రికవరీ చేయగలిగామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 400 కేసులు నమోదు కాగా, 16 శాతం మోత్తాన్ని రికవరీ చేయగలిగామని డీజీపీ ఠాకూర్ వెల్లడించారు. దీన్నిబట్టి సైబర్ నేరాలను ఛేదించడంలో పోలీసుల సామర్థ్యం పెరిగిందని రుజువవుతోందని అన్నారు. వన్‌టైం పాస్‌వర్డ్, ఏటీఎం నుంచి నగదును దొంగిలించడం, లాటరీ పేరుతో అక్కౌంట్ నెంబర్లు తెలుసుకుని, తెలివిగా ఆ అక్కౌంట్‌లలోని మొత్తాలను అపహరించడం, చివరకు ఆర్బీఐ పేరుతో ఫేక్ మెయిల్స్‌ను సృష్టించి వాటి ఆధారంగా కూడా కోట్ల రూపాయలు దొంగిలిస్తున్న దాఖలాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ సేవలు ఏవిధంగా పెరుగుతున్నాయో, అంతేవేగంగా సైబర్ నెరాలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లకు చోరీ కేసుల కన్నా సైబర్ నేరాలే అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి విశాఖలో ఇప్పటి వరకూ 90 మందిని అరెస్ట్ చేశారని, వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకూ శిక్షణ పొందాల్సిందేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 957 మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఈ శిక్షణ మూడు రోజుల నుంచి 15 రోజుల వరకూ ఉంటుంది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అపరిచితులెవరైనా ఆధార్ కార్డు నెంబర్ అడిగినా ఇవ్వద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రజలకు తాము అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తున్నామని ఠాకూర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ లడ్డా, విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.