రాష్ట్రీయం

ఆ తాసీల్దారే కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట: రేణిగుంట తహశీల్దార్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ రద్దు చేసుకుని విధుల్లో చేరాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండల వ్యాప్తంగా నాలుగు రోజులుగా మండల పరిధిలోని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. రేణిగుంట తహశీల్దార్ నరసింహులు నాయుడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని జీర్ణించుకోలేని మండల ప్రజలు గత నాలుగురోజులుగా ధర్నాలు, నిరసనలు, నిరాహారదీక్షలు, ఆత్మహత్యాయత్నాలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం మండల పరిధిలోని కుర్రకాల్వ, పద్మానగర్, తూకివాకం, గాజులమండ్యం, అత్తూరు, పన్నీరుకాలువ, వినాయకనగర్‌లకు చెందిన గ్రామస్థులు బస్టాండ్ వద్ద 300 మంది అక్కడికి చేరుకొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భారీ ఎత్తున ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించి దాదాపు 2గంటల సేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వేణు, భాస్కర్‌యాదవ్, నాగరాజు, ఐజయ్యలు మాట్లాడుతూ గడిచిన నాలుగు రోజులుగా మండల పరిధిలోని గ్రామస్థులు స్వచ్ఛందంగా తహశీల్దార్ వీఆర్‌ఎస్‌ను రద్దుచేసి విధుల్లోకి తీసుకోవాలని ధర్నాచేస్తున్నామని, ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. ఆలస్యం చేసేకొద్దికీ ఈ ధర్నా, నిరసన కార్యక్రమాలను ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేసి ఉద్ధృతం చేస్తామన్నారు. డీటీ గోవర్దన్ స్వామి నిరసనకారులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులకు ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుపుతున్నామని, వెంటనే సమస్యను పరిష్కరించాలని తాము కోరామని, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై చర్చలు చేస్తున్నారని, త్వరలోనే పరిష్కారం అవుతుందని నిరసన కారులు తెలిపారు. ధర్నా జరుగుతున్న సమయంలో వెంకటేష్ అనే యువకుడు తహశీల్దార్ వీఆర్‌ఎస్‌ను రద్దుచేయాలని కోరుతూ కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొనేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆత్మహత్యాప్రయత్నాన్ని అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజల కోరికను నెరవేర్చాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.