ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ఘనంగా జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 8: ఇస్కాన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శనివారం శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ రథయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రకరకాల పుష్పాలతో అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఇస్కాన్ దక్షిణ భారత అధ్యక్షులు శ్రీ సత్యగోపీనాథ్ దాస్ రథయాత్రను ప్రారంభించారు. నగరంలోని ప్రధానవీధుల గుండా సాగిన రథయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రథయాత్ర ముందు ప్రదర్శించిన కథాకళి, ఉరుములు, గొరవయ్యలు, డప్పు వాయిద్యాలు, మరగాళ్లు, కీలుగుర్రాలు భక్తులను అలరించాయి.