12న ‘ఎందుకో ఏమో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరోహీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలితి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమాపై మంచి క్రేజ్‌ని ఏర్పరిచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పాటలన్నీ రాశాను. మంచి రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు. నటుడు నోయల్ మాట్లాడుతూ.. నందు మంచి యాక్టర్. తనతో ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా.. ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు. పునర్నవి సహజ నటి. ఈ సినిమాతో తనకు మంచి పేరొస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు. నటి పునర్నవి భూపాలం మాట్లాడుతూ.. మా నిర్మాత మాలతిగారు ఫస్ట్ సినిమా అయినా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నాకు కాస్ట్యూమ్స్ కూడా తనే డిజైన్ చేశారు. అలాగే మా డైరెక్టర్ చెప్పిన లైన్‌కి ఎగ్జైట్ అయి వెంటనే సినిమా ఒప్పుకున్నా.. సోషల్ నెట్‌వర్క్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నది మా చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నందు నోయల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో వారిద్దరు మంచి ఫ్రెండ్సయ్యారు’ అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. ‘లేడీ పొడ్యూసర్‌తో సినిమా చేయడం ఇదే ప్రథమం. ఎంతో అభిరుచితో సినిమా చేశారు. మా దర్శకుడు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం కల్పించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్. పునర్నవి, నోయల్ మంచి ఫ్రెండ్సయ్యారు’ అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ.. ‘ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఫ్యామిలీ, యూత్‌కి నచ్చే విధంగా ఉంటుంది. నందు, నోయల్, పునర్నవి పోటాపోటీగా నటించారు. క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఈనెల 12న గ్రాండ్‌గా సినిమా రిలీజ్ అవుతుంది’ అన్నారు. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ.. ‘మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. మంచి లవ్ స్టోరీతోపాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. మంచి కానె్సప్ట్స్‌తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా మంచి కానె్సప్ట్‌తో వచ్చే సినిమా ఇది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేయగలిగాం అన్నారు.