హిందీ అర్జున్‌రెడ్డికి నో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో సంచలనం రేపిన చిత్రం అర్జున్‌రెడ్డి. పెల్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌ని చేసింది. ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ మొదలెడదామని అనుకునే లోగా ఈ సినిమాలో హీరోయిన్ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇందులో హీరోయిన్‌గా తార సుతారియాని ఎంపిక చేసారు. అయితే ఆమె తాజాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలో నటిస్తుంది. అర్జున్‌రెడ్డి సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతోనే ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ బిటౌన్‌లో మాత్రం మరోలా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ లిప్‌లాక్ సీన్స్ ఉండడంతోనే ఈ అమ్మడు తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజనిజాలు ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.