ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాల మహాగర్జనకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఈ నెల 15న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్‌లో జరగనున్న మహాగర్జన బహిరంగ సభలో పాల్గొనే ప్రజల సౌకర్యార్థం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పీ మధు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న రాత్రి 9.30 గంటలకు అనంతపురం నుండి ఒక రైలు బయలుదేరి 15న ఉదయం 6-7 గంటల మధ్య విజయవాడ చేరుకుంటుందన్నారు. 14న రాత్రి 7గంటలకు మరో రైలు చిత్తూరు నుండి బయలుదేరి రేణిగుంట మీదుగా 15న ఉదయం 6-7 గంటల మధ్య విజయవాడ చేరుతుందని తెలిపారు. ప్రజలు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకుని మహాగర్జనను జయప్రదం చేయాలని వారు కోరారు.