ఆంధ్రప్రదేశ్‌

ఎన్డీఏ పాలనలో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 9: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరికొంతకాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణిస్తుందని మాజీ కేంద్ర మంత్రి కేవీ తంగవేలు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా 18 పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో తరచు పెట్రోల్, డీజల్ ధరలను పెంచడం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేయడమేనన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినపుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను తగ్గించిందని, కానీ నేడు బీజేపీ ప్రభుత్వం క్రూడాయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ ధరలు తగ్గించకపోగా మరింతగా పెంచడం అప్రజాస్వామికమన్నారు. ప్రపంచ దేశాలు తమ ప్రజల కోసం రూ.40లోపే పెట్రోల్ అందిస్తున్నాయని, మన దేశం నుంచి 15 దేశాలకు లీటర్ పెట్రోల్‌ను రూ.34కి, 29 దేశాలకు రూ. 27కే డీజిల్‌ను మనదేశం సరఫరా చేస్తోందన్నారు. కానీ మన దేశంలో మాత్రం లీటర్ పెట్రోల్ రూ.80 దాటుతోందని అన్నారు.
వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేవీ తంగవేలు డిమాండ్ చేశారు. ఇందుకోసం సోమవారంనాడు చేపడుతున్న భారత్ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసంక్షేమాన్ని కోరుకుంటుందని, ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న 6 నెలల్లో అనూహ్య పరిమాణాలు చోటుకుంటాయని తెలిపారు. ఈవిలేఖరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, ఏఐసీసీ కార్యదర్శులు ప్రమీలమ్మ, నైనారు శ్రీనివాసులు, డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.