రాష్ట్రీయం

క్రూడాయిల్ తగ్గినా పెట్రో ధరల్లో మార్పేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 9: గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రూ.68, డీజిల్ రూ.53 ఉందని, ఇప్పుడు బ్యారెల్ ధర 69.02 డాలర్లు తగ్గిందని, వాటికి అనుగుణంగా ధరలను తగ్గించకుండా అధికంగా పెట్రోల్ రూ.85.23, డీజిల్ రూ.78.39లకు ధరలు పెరిగాయని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు.
ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే పన్ను అంటూ జీఎస్టీ గురించి ఊదరగొట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసురాకుండా రోజువారి ధరల మధింపు విధానం అమలు చేస్తుండడంతో వాటి ధరలు రోజురోజుకు మండిపోతున్నాయని ఆరోపించారు.
ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం పెట్రోల్ కంపెనీల లాభాల కోసం మోదీ ప్రభుత్వం సహకరిస్తూ, క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా పెట్రో ధరలను తగ్గించకుండా ప్రజలను దోచుకుతింటుంటే, కేంద్రంతో కోట్లాడి ధరలను నియంత్రించాల్సిన రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంగారు తెలంగాణ అని నినదిస్తూనే కేంద్రంతో పోటీపడి ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు విధించి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా చూసుకుంటే అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బీహరీ, ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, గోవా, త్రిపుర తదితర 22 రాష్ట్రాల కంటే ఎక్కువగా పెట్రోల్‌పై అధిక పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆరోపించారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్ ధరల పెంపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే 2014 ఏప్రిల్ నాటికి దేశంలో డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటి రూ.3.56ఉండగా, గత నాలుగేళ్ల కాలంలో అది 380 రేట్లు పెరిగి లీటర్‌కు రూ.17.33కు చేరిందని, ఈ విషయాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలని సూచించారు. కార్లల్లో తిరిగే ధనవంతులపై దీని ప్రభావం పెద్దగా లేకపోవచ్చు, కానీ పేద, మధ్య తరగతి వర్గాలపై ఈ ధరల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. పెట్రోల్, డీజీల్ అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని, ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెట్రోల్ ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారత్ బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ బంద్‌లో అన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాసన్ కృష్ణన్ కోరారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుద్దాల దేవయ్య పాల్గొన్నారు.

చిత్రం..కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్