రాష్ట్రీయం

వరంగల్లు కొండా ఇల్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లా?’ అని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన విమర్శ తిరిగి ఆమె మెడకే చుట్టుకున్నట్టు అయింది. మరి ‘వరంగల్ జిల్లా.. కొండా ఇల్లా?’ అని టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. టీఆర్‌ఎస్‌లో కొండా సురేఖ చేరేనాటికే తెలంగాణ ఉద్యమంలో పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం చురుకైన పాత్ర పోషించిందని శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాది అయిన దివంగత వైఎస్‌ఆర్‌తో అంటకాగి, ఆ తర్వాత తెలంగాణ డిమాండ్‌ను పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించిన జగన్‌తో చేతులు కలిపిన కొండా సురేఖకు కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని టీఆర్‌ఎస్ వర్గాలు నిలదీస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు, కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ ప్రజా క్షేత్రంలో గెలిసొచ్చిన ప్రజా ప్రతినిధులని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. మరి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్‌కు తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఏముందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోని కొండా సురేఖే తన కుటుంబానికి మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలని కోరినప్పడు, ఉద్యమం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పేమిటనీ మండిపడుతున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని, టిక్కెట్లలో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శిస్తోన్న సురేఖ, ఒకవేళ తన కూతురు సుష్మిత, భర్త కొండా మురళీకి మూడు టిక్కెట్లు ఇచ్చి ఉంటే, ఈ విమర్శలు చేసేదా? అని నిలదీస్తున్నారు.