రాష్ట్రీయం

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు తిక్కవరపు వెంకటరమణారెడ్డి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు దివంగత హాస్యనటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు. నెల్లూరుకు చెందిన కళాంజలి సాంస్కృతిక సంస్థ ఈ ఏడాదికిగాను రమణారెడ్డి అవార్డును పృథ్వీరాజ్‌కు అందజేసింది.
ఈసందర్భంగా అవార్డును స్వీకరించిన పృద్వీరాజ్ మాట్లాడుతూ తన హావభావాలు, వాగ్దాటితో పాటు మెజీషియన్‌గా ప్రసిద్ధి చెందిన తిక్కవరపు వెంకటరమణారెడ్డి స్మారక అవార్డును తాను అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి, ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ తదితర మహామహులకు నెలవైన నెల్లూరు గడ్డపై తాను హాస్యనట చక్రవర్తి రమణారెడ్డి స్మారక అవార్డును స్వీకరించడంతో తన జన్మ ధన్యమైందన్నారు.
గత 30 ఏళ్లుగా తాను తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్నానని, ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందానని అయితే రమణారెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ అవార్డును తాను అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పృద్వీరాజ్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాంజలి సంస్థ వ్యవస్థాపకులు అనంత్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తిక్కవరపు వెంకటరమణారెడ్డి అవార్డును అందుకుంటున్న ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్