క్రైమ్/లీగల్

రైలు కింద పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.సిగడాం, సెప్టెంబర్ 10: మండలం బాతువ గ్రామానికి చెందిన సామంతుల దాలినాయుడు (29) ఆదివారం సాయం సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెల్తే తన పశువులను రైల్వే పట్టాల సమీపంలో పశువులు మేత మేస్తుండగా రైలు బండి వస్తున్నట్లు గుర్తించి వాటిని తోలేందుకు గాబరాగా వెళ్లారు. ఆసమయంలో పశువులు తప్పుకున్నాయి. దాలినాయడు బండికి బలైపోయాడు. మృతునికి భార్య రమణమ్మ, కుమార్తె శ్రవంతి, కుమారుడు లక్ష్మణనాయుడున్నారు. మృతదేహాన్ని జి.ఆర్.పి రైల్యే హెచ్‌సి సింహాచలం సమాచారాన్ని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.