క్రైమ్/లీగల్

గచ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10: గచ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు జనం పైకి దూసుకెళ్ళడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సహా ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని బలిగొన్న బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు దిగి పారిపోయాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు వాస్తవ్యుడైన జనార్ధన్ (33) నానక్‌రామ్‌గూడలోని క్యాప్ జెమినిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన జనార్ధన్, అతని మిత్రుడు గచ్చిబౌలి క్రాస్‌రోడ్స్ వద్ద బస్సు దిగి ఆటోకోసం డ్రైవర్‌తో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో లింగంపల్లి నుంచి కోఠి వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు (ఏపీ 11 జడ్ 6172) డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ జనం పైకి తీసుకెళ్లాడు. బస్సు ఢీ కొట్టడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జనార్ధన్‌తో పాటు నానక్‌రామ్‌గూడకు చెందిన ఆటో డ్రైవర్ దశరథ్ (45), పాతబస్తీలోని జహనుమాకు చెందిన మరో ఆటో డ్రైవర్ అబ్దుల్ హమీద్ (50) బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు.
రాయదుర్గం పోలీసులు శవపంచనామా జరిపి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..*గచ్చిబౌలి వద్ద ముగ్గురి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు