రాష్ట్రీయం

ఒత్తిడి లేని విద్యతోనే సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఒత్తిడి లేని చదువులతో సత్ఫలితాలు వస్తాయని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. మంగళవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తక తెలుగు అనువాద సంపుటిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించారు.
రవీంద్రభారతిలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, విద్యావేత్త చుక్కా రామయ్య, పుస్తకాన్ని తెలుగులో అనువదించిన బీవీ పట్ట్భారాం పాల్గొన్నారు. ప్రతి ఏడాది కోట్లాది మంది విద్యార్థులు వివిధ రకాల పరీక్షలు రాస్తున్నారని, వారందరికీ ఒత్తిడి వారి నివాసం నుండే మొదలవుతుందని పేర్కొన్నారు. పరీక్షలను ఒక ఉత్సవం మాదిరి విద్యార్థులు భావించాలని, పరీక్షను ఉత్సవంగా పరిగణించడమేగాక, ఉత్సవాన్ని చేసుకున్న ఆనందాన్ని పొందాలని చెప్పారు. విద్యార్ధులకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ప్రధాని నరేంద్రమోదీ 25 సూత్రాలను చెప్పారని, ఆ సూచనలతో ఎగ్జామ్స్ వారియర్స్ పేరిట పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని చెప్పారు. 200 దేశాల్లో ఏ దేశ ప్రధానీ విద్యార్థుల పరీక్షలపై పుస్తకాలు రాయలేదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే ఈ పుస్తకాన్ని రాశారని అన్నారు. దీనిని అన్ని భాషల్లోకి అనువదించడం జరిగిందని, తెలుగులో కూడా ఆనువదించి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.