రాష్ట్రీయం

త్వరలో మహాకూటమి బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఓడించడమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడేందుకు సమాయత్తమవుతున్న విపక్షాల నేతలు మరోవైపు భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్నది త్వరలో నిర్ణయించనున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ప్రణాళికతోనే ముందస్తుకు వెళ్లాలని విపక్షాల నేతలు భావిస్తున్నారు. వేర్వేరు ఎన్నికల ప్రణాళికలతో వెళ్తే ప్రజల్లో అయోమయం ఉంటుంది కాబట్టి ఒకే మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలాఉండగా మంగళవారం నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఇతర నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పొత్తులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కాంగ్రెస్-టీడీపీ-సీపీఐ నేతల మధ్య పొత్తుల కోసం ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరింది. సమావేశానంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు విపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ సంఘాలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఇది తొలి సమావేశం మాత్రమేనని అన్నారు. రమణ మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని విమర్శించారు. సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని మట్టిలో కలిపారని విమర్శించారు.
తలనొప్పులూ షురూ..
టీడీపీ ఇప్పటికే 15 స్థానాలను కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి జాబితా అందజేసింది. ఆ 15 స్థానాల్లో ఉప్పల్ కూడా ఉండడంతో, ఇక తనకు సీటు రాదేమోనన్న బాధతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి బుధవారం అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఉప్పల్‌లో టీడీపీ తరఫున మాజీ హోం మంత్రి టీ. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. లక్ష్మారెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకాలు ఉత్తమ్‌కు కత్తిమీద సామే.
కాగా కొత్తగూడెం అసెంబ్లీ సీటు సీపీఐకి కేటాయించనున్నట్లు ప్రచారం ప్రారంభంకావడంతో, ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వర రావు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వారు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాసం ఎదుట బైఠాయించారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు వారికి నచ్చజెప్పి పంపారు.