ఆంధ్రప్రదేశ్‌

ఇక చలువ గదుల్లో ప్రభుత్వ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారుచేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేయడం, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం, ప్రత్యేకంగా ఒక విర్చువల్ తరగతి గది ఏర్పాటుపై దృష్టి సారించినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. విర్చువల్ తరగతి గదిలో కంప్యూటర్, భారీ తెర, ప్రొజెక్టర్, ఎయిర్ కండీషనర్, మైక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విర్చువల్ గదులు రానున్న జనవరి నాటికి సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
దశలవారీగా చేపట్టే ఈ కార్యక్రమంలో మొదట ఎంపిక చేసిన పాఠశాలల్లో పూర్తి చేస్తారు. ఆ తరువాత 2020 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో విర్చువల్ తరగతి గదుల నిర్మాణం, అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గుర్తించిన పాఠశాలల్లో త్వరలో విర్చువల్ గదులను ప్రారంభించి జనవరి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడు నెలల పాటు ఆ గదిలో సిలబస్ రివిజన్ కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆ తరువాత 2019 విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులకు సాధారణ తరగతుల్లో విద్యతో పాటు అవసరమైన సబ్జెక్టుల్లో విర్చువల్ తరగతి గదులను ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్న పాఠశాలలు 40,665 ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో ఉన్నత పాఠశాలలు 4124, ప్రాథమికోన్నత పాఠశాలలు 5711 ఉన్నట్లు సమాచారం. వీటిలో ఈ ఏడాది ఒక్కో జిల్లాలో మూడవ వంతు పాఠశాలల్లో విర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నారని స్పష్టమవుతోంది.
కాగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఉన్నప్పటికీ వాటి వినియోగంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటని పరిష్కరిస్తూ విర్చువల్ తరగదుల ఏర్పాటు చేస్తారని స్పష్టమవుతోంది. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో పాఠశాలల్లో సీటు కోసం తల్లిదండ్రులు వేచి చూడాల్సిన పరిస్థితులు వస్తాయని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. పాఠశాలలకు మరమ్మతు చేసి రంగులు వేయడం, తరగతి గదులన్నింటిలో బెంచిలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో 90 శాతం పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవని అదే ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం మైదానాలు కలిగిన పాఠశాలలు ఉన్నాయని వారంటున్నారు.
అంతేగాక ప్రతి రోజు ఒక గంట విద్యార్థులకు క్రీడాశిక్షణ కూడా ఉంటుందని, దాంతో పాటు చదువు విషయంలో విద్యార్థులపై ఒత్తిడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని వారు భరోసా ఇస్తున్నారు.
దీని కారణంగా విద్యార్థులు చక్కటి విద్య నభ్యసించడానికి వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చోటుచేసుకోనున్న మార్పులతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఊరటనిచ్చే అవకాశాలున్నాయని వారంటున్నారు.