బొంబాయి పోతావా పాట క్రేజ్ తెచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంబాయి పోతావా రాజా.. బొంబాయి పోతావా.. పాట ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంపత్‌నంది నిర్మాణంలో తెరకెక్కిన పేపర్‌బాయ్ చిత్రంలోని ఈ పాట మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాట ద్వారా గీత రచయిత సురేష్ ఉపాధ్యాయకు మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన సందర్భంగా సురేష్ చెప్పిన విశేషాలు.. తాజాగా పేపర్‌బాయ్ చిత్రంలో నేను రాసిన బొంబాయి పోతావా రాజా పాటకు అనూహ్యమైన స్పందన రావడం ఆనందంగా వుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ సాధించింది. అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కింది. ఈ సినిమాలో 3 పాటలు రాశాను. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ప్రోత్సాహంతో ఇందులో పాటలు రాయడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది నిర్మించిన పేపర్‌బాయ్ చిత్రం మంచి విజయం సాధించడం, అందులో నేను రాసిన 3 పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా వుంది. సినీ రంగంలో గీత రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నాకోరిక. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శాంతినగర్. చిన్నప్పటినుంచి ఎస్.పి.బాలు పాటలు విని పెరిగాను. అలా పాటలపై ఉన్న ఆసక్తితో గీత రచయిత అవ్వాలన్న ఆలోచన కలిగింది. చంద్రబోస్ నాకు స్ఫూర్తి. అలాగే ఆత్రేయ, సిరివెనె్నల, వేటూరి పాటలు ఇష్టం. మంచి చిత్రంలో అవకాశం కల్పించిన సంపత్‌నంది, భీమ్స్‌లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.