క్రైమ్/లీగల్

న్యూడెమోక్రసీ కోరియర్ వీరన్న అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 12: గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపూర్‌కు చెందిన న్యూడెమోక్రసీ పుల్లన్న దళం కోరియర్ నెమురుగొమ్ముల వీరన్న అలియాస్ గోపయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 తుటాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు సీఐ బాలాజీ నాయక్ తెలిపారు. ఈమేరకు అరెస్టు వివరాలను విలేఖరులకు తెలిపారు. న్యూడెమోక్రసీ రాయలవర్గానికి చెందిన దళ కమాండర్ పుల్లన్న ఇటీవల అరెస్టు చేశామని చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 11న పోలీసు కస్టడీకి పుల్లన్నను తీసుకుని విచారించామని తెలిపారు. ఈక్రమంలో ఎల్లాపూర్‌కు చెందిన వీరన్న గత 25 ఏళ్లుగా న్యూడెమోక్రసీ పార్టీలో పనిచేస్తూ అజ్ఞాత దళాలకు కోరియర్‌గా పనిచేస్తున్న విషయం వెలుగు చూసిందన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, అటవీశాఖ అధికారుల బెదింరింపులకు గురి చేశారని తెలిపారు. అజ్ఞాత దళాలకు ఎవరు సహకరించిన ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించరా. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్సై యాసిన్ పాల్గొన్నారు.