క్రైమ్/లీగల్

కాలువలో కొట్టుకుపోయన అత్తాకోడళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, సెప్టెంబర్ 12: స్థానిక పాల ఫ్యాక్టరీ వద్ద సప్లై కాలువ లాకుల సమీపాన బుధవారం కాలువలో బట్టలు ఉతుకుతున్న అత్త, కోడలు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమీపంలోని లాకుల్లో పని చేస్తున్న లస్కర్ నాగరాజు వెంటనే కాలువలోకి దూకి అత్తను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వివరాల్లోకి వెళితే ఆటో డ్రైవర్ గంటా విశే్వశ్వరరావు తల్లి గంటా రాజేశ్వరి (50), భార్య గంటా శివలక్ష్మి (30) ఇరువురు ప్రతి రోజూ మాదిరిగానే బట్టలు ఉతకటానికి కాలువ రేవుకు వెళ్లారు. గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలు వల్ల మెట్లు కాలువ నీటిలో మునిగిపోయాయి. మెట్లకు పాకుడు ఉండటంతో కాలు జారి అత్త రాజేశ్వరి కాలువలో పడిపోయింది. ఆమెను కాపాడటానికి కోడలు శివలక్ష్మి కాలువలోకి దూకింది. సమీపంలోని లాకుల సిబ్బంది వారిని కాపాడటానికి ప్రయత్నించారు. రాజేశ్వరిని మాత్రమే నాగరాజు ఒడ్డుకు లాగి కాపాడగలిగాడు. కోడలు శివలక్ష్మి గల్లంతైంది. ఎన్డీఆర్‌ఏఫ్ బృందం బుధవారం సాయంత్రం పామర్రు చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎస్‌ఐ పి రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.