ఆంధ్రప్రదేశ్‌

నిమజ్జనంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, సెప్టెంబర్ 15: నిమజ్జనానికి తరలిస్తున్న వినాయక విగ్రహానికి స్వామి ప్రభోదానంద శిష్యులు నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం పూర్తిగా కాలి బూడిదైంది. అంతటితో ఆగని వారు ఊరేగింపులోని భక్తులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీని సైతం దగ్ధం చేశారు. మూడు ట్రాక్టర్లు, రెండు ఆటోలు, రెండు బైక్‌లు తగులబెట్టారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దపొలమడ, చిన్నపొలడమ గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను శనివారం నిమజ్జనానికి తరలించారు. తొలుత పెద్దపొలమడ గ్రామస్తులు వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. మార్గమధ్యంలోని శ్రీకృష్ణ ప్రభోదానందస్వామి ఆశ్రమం వద్దకు చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు అర్ధనగ్నంగా, పూర్తి నగ్నంగా నృత్యాలు చేస్తుండగా ఆశ్రమ నిర్వాహకులు అడ్డుకున్నారు.
ఆశ్రమంలో జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నందున ప్రశాంతంగా ముందుకు కదలాలని వారు సూచించారు. అయితే గ్రామస్తులు అలాగే నృత్యం చేస్తుండడంతో వారించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆశ్రమ నిర్వాహకులు రాళ్లు, కర్రలతో నిమజ్జనంలో పాల్గొన్నవారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో గ్రామస్తులు వినాయక విగ్రహాలను వదిలిపెట్టి పారిపోయారు. మరికొద్ది సేపటికి చిన్నపొలమడ గ్రామస్తులు విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తుండగా ఆశ్రమ నిర్వాహకులు అడ్డుకుని దాడి చేశారు. ఓ ట్రాక్టర్‌లో ఉన్న వినాయక విగ్రహానికి నిప్పు పెట్టారు. వినాయక ప్రతిమ ప్లాసర్ ఆఫ్ ప్యారిస్ చేసినది కావడంతో పూర్తిగా కాలిపోయి బూడిద మిగిలింది. అంతటితో ఆగని ఆశ్రమ నిర్వాహకులు మరో రెండు ట్రాక్టర్లు, రెండు ఆటోలు, రెండు బైక్‌లకు సైతం నిప్పు పెట్టారు. సమీపంలోని టీడీపీ నాయకుడు నాగార్జునకు చెందిన నాపరాయి ఫ్యాక్టరీలోకి చొరబడి నిప్పు పెట్టారు. ఆశ్రమ నిర్వాహకుల దాడిలో చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రామ్మోహన్, కుళ్ళాయప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సంఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
చిత్రం..ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తగులబెట్టిన ట్రాక్టర్