క్రైమ్/లీగల్

నలుగురు దోపిడీ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, సెప్టెంబర్ 18: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్ళలోకి చాకచక్యంగా దూరి బంగారు ఆభరణాలు, నగదును దోచుకొపోతున్న నలుగురు దోపిడీ దొంగలతో పాటు 17 తులాల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడిన గార్ల కు చెందిన మూడు నిఖిల్, తాళ్ళపల్లి వినయ్, బేతి అరవింద్ దోపిడీలు చెయ్యటం, దోపిడీ వస్తువులను విక్రయాలు జరుపుతున్న పందుల మహేష్ అదుపులోకి తీసుకొని విచారించగా వారి గుట్టురటైందన్నారు. వీరంత మండలంలో కలియ తిరుగుతూ పట్టపగలే తాళాలు వేసిన ఇళ్ళలోకి దూరటం, అందిన వస్తువులను అపహరించుకొని పోయి వస్తువులను విక్రయించటం వచ్చిన డబ్బులతో విచ్చలవీడిగా ఖర్చులు చేసుకునే వారన్నారు. ఇటీవల కాలంగా గార్ల శివాలయం వీధిలో కొదుమూరి రాకేష్, నిర్మలా హైస్కూల్‌లో ఉపాద్యాయుడుగా పని చేస్తున్న పిల్లే బెర్నాడ్‌లతో పాటు మరి కొందరి ఇళ్ళలోకి 17 తులాల బంగారు ఆభరణాలు దోచారని, వీటి విలువ ఐదున్నర లక్షల రూపాయాలుంటుందని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. నలుగురు నిందితులు, సొత్తును స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దోపిడీ దొంగతనాల కేసును ఛేదించిన గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్, గార్ల ఎస్‌ఐ పీ.శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుల్స్ బి మురళీ, డి రవి, చీమల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మధుసూదన్ రెడ్డిలను ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందించారు. ఈ విలేఖరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.