అదిలాబాద్

అందత్వ నివారణే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20: అందత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ప్రపంచంలో మరెక్కడ లేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితారాణా అన్నారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్‌తో పాటు డైరెక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ దివ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ యోగితారాణా మాట్లాడుతూ దూరదృష్టితో ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, అందత్వ నివారణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈకార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళి అమలు చేసినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కార్యక్రమం అమల్లో వైద్య అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నిరంతరం కార్యక్రమాలను సమీక్షిస్తూ లోటు పాట్లను సవరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఆయా జిల్లాల్లో తాను పర్యటిస్తూ కంటి వెలుగు కార్యక్రమాలను సమీక్షిస్తూ వస్తున్నాని, ఇది పదోవ జిల్లా అని పేర్కొన్నారు. సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన నోడల్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక రూపంలో ప్రగతిని ఉన్నతాధికారులకు అందజేయాలని అన్నారు. మండల, గ్రామస్థాయిలో మరింత చైతన్యం తీసుకరావాలని కోరారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందునా ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మైక్రో యాక్షన్ ప్లాన్ రూపొందించి మలేరియా, డెంగ్యూ, క్షయ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సీజన్‌కంటే ముందుగానే వ్యాధులు ప్రబలడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌ను కమిషనర్ ప్రశంసించారు. జిల్లా అధికారుల పనితీరువల్లే ప్రగతి సాధిస్తుందని, కలెక్టర్‌తో పాటు జిల్లాకు మంచిపేరు వస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను వెల్లడించారు. అక్కడక్కడా వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్ళారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జి.శ్రీనివాస్‌రావు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వైద్యా శాఖ అధికారులు డాక్టర్ రాజీవ్ రాజ్, డాక్టర్ జలపతి నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.