క్రైమ్/లీగల్
మద్యం బాటిల్స్ స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జియ్యమ్మవలస, సెప్టెంబర్ 21: మండలంలో గల పెదమేరంగి సెంటర్ నుంచి చినమేరంగికి అక్రమంగా తీసుకువస్తున్న 112 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చినమేరంగి ఇన్‌ఛార్జి ఎస్ఐ బాలాజీరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో చినమేరంగి గ్రామానికి చెందిన ముంజి వెంకటరమణ, గెంబలి కాశీవిశ్వనాధం అనే ఇద్దరు వ్యక్తులు మద్యం బాటిల్స్‌ను అక్రమంగా తీసుకువస్తుండగా పెదమేరంగి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారిని పట్టుకున్నామన్నారు. గత నెలలో ఇదేవిషయమై వీరిద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. మరలా 112మద్యం బాటిల్స్‌ను తీసుకురావడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మండలంలోని చినమేరంగి స్టేషన్ పరిధిలో ఎవరైన బెల్ట్‌షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలాజీరావు హెచ్చరించారు.