Others

ఆనాటి ముచ్చట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారక రామారావు నిర్మాతగా చిత్ర నిర్మాణం చేస్తున్న తరుణంలో తొలిసారి ‘సీతారామ కల్యాణం’తో దర్శకత్వంపై దృష్టిపెట్టారు. శ్రీరామ, లక్ష్మణ, సీత పాత్రలకు కొత్త తారలను తీసుకునే ఉద్దేశంతో హరనాథ్, శోభన్‌బాబు, గీతాంజలిని ప్రధాన పాత్రలుగా ఎన్నుకుని సినిమా ప్రారంభించే సమయానికి ఫోటోగ్రాఫర్ సి నాగేశ్వరరావు అందుబాటులో లేకపోయేసరికి హిందీ సినిమాలో పేరు గడిస్తున్న రవికాంత్ నగాయిచ్‌ని అప్పటికప్పుడు పిలిపించి సినిమా మొదలుపెట్టారు. ఓసారి షూటింగ్ విరామ సమయంలో రాముడి పాత్రధారి హరనాథ్ రాముడి వేషంలో సిగరెట్ తాగుతుంటే ఎన్టీఆర్ తీవ్రంగా మందలించారట. పాత్రను పవిత్రంగా, ఏకాగ్రతతో పోషించాలన్నది ఆయన భావన. హరనాథ్‌కంటే శోభన్‌బాబునే ఎన్టీఆర్ పుష్కర కాలంపాటు చేయూతనిచ్చారు. మణి సిస్టర్స్‌గా పిలిచే (మణి, రత్న) అక్కచెల్లెళ్లు ఈ చిత్రంలో కనిపిస్తారు. అనంతరం మణి గీతాంజలిగా పేరు మార్చుకుంది. ఈ చిత్రంలోని సీతారాముల కల్యాణం చూతము రారండి అనే పాట సూపర్ హిట్టయి ఆనాటి ప్రేక్షకుల నోళ్లలో కొనే్నళ్లపాటు నాని ఆనాటి తరాన్ని అలరించడమేకాక ఈ నాటికీ శ్రీరామ నవమి పందిళ్లలో పెళ్లి పందిట్లో వినబడుతూ ఉంటుంది. ఈ పాట ప్రభావం తర్వాత నిర్మించిన రామాయణ ఇతివృత్త చిత్రాల్లో కనిపించినా, అనుసరించినా ఇంత రక్తి కట్టించలేకపోయాయి. ఈపాటలోని ఓ చరణం ‘జానకి దోసిట కెంపుల ప్రోలై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములు తలంబ్రాలుగా.. శిరముల మెరసిన సీతారాముల’ పదాల సారాంశాన్ని వొడిసి పట్టి బాపు ‘సీతా కల్యాణం’లో సీతారాముల దోసిటలో తలంబ్రాలు పోసుకునేటప్పుడు వారి శరీర కాంతిని బట్టి రంగులు మారినట్టుగా చూపించడం గమనార్హం. అంటే ఆనాటితరంఅంకిత భావం, నిబద్ధత కలిగి క్రమశిక్షణతో సినిమా నిర్మించేవారనడానికి ఇదొక ఉదాహరణ. శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకున్న ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం చేపట్టిన ఎన్టీ రామారావు టైటిల్స్‌లో తన పేరు వేసుకోకపోవడం మరీ విశేషం!

-పీవీఎస్పీ, అద్దంకి