రాష్ట్రీయం

ప్రకృతి సేద్యానికి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో సహజ ఎరువులతో పంటలు పండించే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఇది రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు జలాశయం సమీపంలో నిర్మించిన టనె్నల్‌ను శనివారం ప్రారంభించి సీఎం కడప జిల్లా గండికోట జలాశయానికి నీటిని విడుదల చేశారు. అనంతరం అవుకు జలాశయంలో జలసిరి హారతి నిర్వహించారు. గోరుకల్లు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది రైతులు 5.5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇది ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందడంతో ఈ అంశంపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు తాను ఆదివారం తెల్లవారుజామున అమెరికా పయనమవుతారు. ఐరాసలో ప్రసంగం అనంతరం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని పలువురు ప్రముఖులతో చర్చించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉన్నందునే తనపై నమ్మకంతో ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు వస్తున్నారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రైతులు ఎవరూ రసాయనిక ఎరువుల వినియోగం లేకుండా నాణ్యమైన పంటలను పండించి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచడానికి సిద్ధపడాలన్నారు. వ్యవసాయ రంగంలో నాలుగేళ్ల క్రితం ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించి రైతుల ముఖంలో ఆనందాన్ని చూసేందుకు
ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గతంలో డబ్బు కోసం ప్రాజెక్టు నిర్మాణాలను ప్రారంభించి గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.57 వేల కోట్ల ఖర్చుతో వాటన్నింటినీ పూర్తిచేస్తున్నామని అన్నారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందని, అలాంటి రైతులకు అండగా నిలబడడమే తన అభిమతమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల ఇంటి పేర ఇష్టానుసారంగా దోచుకుంటే తాము అలా దోపిడీకి ఆస్కారం లేకుండా వాస్తవ లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు. ఈ విధానంలో గతంలో నాయకులు చేసిన రూ.4 వేల కోట్ల దోపిడీ వెలుగులోకి వచ్చిందన్నారు. 14 లక్షల దొంగ పేర్లు బయటపడ్డాయని, ఇదంతా నాటి అవినీతి పాలకుల చర్య అని విమర్శించారు. రాష్టవ్య్రాప్తంగా 25 లక్షల పక్కాగృహాల నిర్మాణానికి రంగం సిద్ధం చేశామన్నారు. త్వరలో వీటిని పేదలకు అందించి వారి సొంతింటి కల సాకారం చేయనున్నామని సీఎం అన్నారు. ఆలోచనలు ఉంటే సరిపోదని, అవి ఆచరణలో పెట్టగలిగి ప్రజలకు చేరువ చేయగలిగితేనే నాయకుడికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. తాము ఆ పనే చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు తమ ప్రభుత్వ తీరుపట్ల సంతృప్తితో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన తాము పేదలకు రూ. ఐదుకే కడుపు నిండా ఆహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే, సంబంధిత కుటుంబీకులకు రూ. ఐదు లక్షల బీమా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంక్షేమ పథకం పేదలకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. అనేక పరిశ్రమలు వస్తున్నాయని, దీని ద్వారా రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని అన్నారు. పరిశ్రమల స్థాపన అతి త్వరలో పూర్తవుతుందని, తద్వారా 32 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించి నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడమేకాకుండా వారిలోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చి సరిపడ ఉద్యోగం ఇప్పించి అందులో అవసరమైన శిక్షణ ఇప్పించే బాధ్యత తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అఖిల ప్రియ, కాలవ శ్రీనివాసులు, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జీఎన్‌ఎస్‌ఎస్ గేట్ల వద్ద జలసిరికి హారతి ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు