డైలీ సీరియల్

బంగారుకల -53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామరాయలు నిరంతరం ముసల్మాను ప్రాంతాలనదుముకుంటూ ఉండటంతో బీజాపూర్ ఆదిల్‌షా అతనికి వ్యతిరేకంగా ఓ కూటమి తయారుచేసి రామరాయల అహంకారాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న యుద్ధం ఇది.
రాజగురువు సుదర్శనుల వారు ఆఖండజ్యోతిని వెలిగించారు. విద్యారణ్యస్వామి విజయనగర స్థాపకులకు ప్రసాదించిన ఖడ్గాన్ని రామరాయలకు అందజేశారు.
‘‘ఈ జ్యోతి వెలుగుతున్నంత కాలం ఈ ఖడ్గాన్ని యవనులు తాకనంతకాలం మీకు అపజయం ఉండదు. విజయుడవై రమ్మని’’ ఆశీర్వదించి పంపారు.
తొంభై ఆరు సంవత్సరాల వయసులో రామరాయలు యుద్ధానికి బయలుదేరాడు. నగర ప్రవేశం చేసిన అహమద్ ఖాన్ పఠాన్ వేషంలో సదాశివరాయల కుమారుడైన శ్రీరంగ రాయల్ని అపహరించుకుపోయాడు. అసలు పఠాన్ వచ్చాక విషయం తెలిసింది. సరిహద్దులు కట్టుదిట్టమైనాయి. అసలు పఠాన్ రామరాయల అంగరక్షకుడిగా ఉన్నాడు.
రాక్షసి తంగడి లేక తల్లికోట యుద్ధం తెలుగుదేశ చరిత్రలోనే కాదు, యావద్భారత ఉపఖండ చరిత్రలోనే కొత్త మలుపుకు దారితీసింది.
రెండు వైపులా లక్షల సైన్యం సముద్రంలా ఘోషిస్తోంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలు చేశాడు. ఒక భాగం తిరుమలరాయల కింద, మరొకటి వెంకటాద్రి కింద, మూడవది తన అధీనంలో ఉంచుకున్నాడు. మొదట వెయ్యి ఏనుగులు, ఇరవై వేల అశ్వదళం, లక్షమంది కాల్బలంతో తిరుమల రాయలు శత్రువులపై బడ్డాడు. ఇరుపక్షాలు తీవ్రంగా ఢీకొన్నాయి.
ఇదిలాఉండగా వెంకటాద్రి ఐదు మైళ్ళ వెనుక దారితప్పించి తూర్పు వైపునించి హఠాత్తుగా శత్రుసైన్యం మీద పడ్డాడు. బహ్మనీ సైన్యాలు అందోళన చెందాయి. మర్నాటికే రామరాయలు అనంత సైన్యంతో పడమటి వైపునించి దాడిచేశాడు. ఎటుచూసినా విజయనగర సైన్యమై! ఆంధ్ర సైన్యం బహ్మనీల తలలు తరుగుతుంటే వాళ్ళకి దిక్కు తోచలేదు. బహ్మనీలు సంధికి ప్రయత్నించారు. రామరాయలు అంగీకరించలేదు. భయంకర మారణహోమం జరిగింది.
రామరాయలు కొత్త వ్యూహం పన్నాడు. మొదట అశ్వదళం, వెనుక అక్కడక్కడ మరఫిరంగులు, ఆ వెనుక పదాతులు.
బహ్మనీలు కూడా తమ సైన్యాన్ని మూడు విధాలు చేశారు. అనేక ఏనుగులు, గుర్రాలు ఆ యుద్ధంలో మరణించాయి. రామరాయలు సైన్యం మధ్యలో నిలిచి సింహనాదం గావించి ఉగ్రరూపంతో వైరివీరులపై విరుచుకుపడ్డాడు. సుల్తానుల సైన్యం చెల్లాచెదురైంది. మర్నాడు ముందుగా మిత్రపక్షాల బలగాలు మధ్య భాగంలో ఫిరంగి దళంతో నిలిచారు. ఈ ఏర్పాటు కన్పించకుండా రెండువేల మంది విదేశీ విల్లువీరులు అందరికన్నా ముందు వరుసలో నిలబడ్డారు.
శత్రుసైన్యాలు ముందుకు దూకగానే, పన్నిన వ్యూహం ప్రకారం విల్లువీరులు బాణాలు వేయటం కొనసాగించారు. రామరాయల హిందూ సైన్యం దగ్గిరికి రాగానే విల్లువీరులు పక్కకి తప్పుకున్నారు. ఆ వెనుక ఉన్న ఫిరంగులన్నీ ఒక్కసారిగా పేలాయి. రామరాయల సైన్యం చాలావరకు హతమైంది. మిగిలిన కొందరు వెనుదిరిగారు.
వృద్ధుడయిన రామరాయలు ఏనుగు అంబారీ మీద నించి దిగాడు. తన మంత్రుల మాట కూడా వినకుండా స్వయంగా శిబికలో యుద్ధ్భూమిలో తిరుగుతూ పర్యవేక్షించాడు.
విజయం పట్ల ఆయనకు చాలా నమ్మకం ఉంది. యుద్ధ్భూమిలో హిందువుల శతఘు్నల నుంచి, బురుజులపై అమర్చిన లోహపు గొట్టాల ఫిరంగుల నుంచి, మహావినాశనం కల్గించే అగ్నిగోళాలు పేల్చుతున్నారు. రెండువైపులా చాలామంది మరణించారు.
ఆ సమయంలో శిబిక నుండి దిగిన రామరాయలు మణిమాణిక్య ఖచితమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. తన కోశాధికారి ద్వారా తనచుట్టూ ధనరాసులు, బంగారు ఆభరణాలు, మణిమాణిక్యాల కుప్పలు ఏర్పాటుచేయించాడు. ఆ ధనాన్ని అతని దృష్టిని ఆకర్షించిన అనుచరులకివ్వాలని రామరాయల ఆలోచన, సైన్యాన్ని ఉత్సహపరుస్తూ రామరాయలు యుద్ధరంగంలో వీరోచితంగా మాట్లాడాడు.
‘‘ఓ విజయనగర యోధులారా! మనకిది పరీక్షా సమయం. ఈనాడు జయిస్తే ఆంధ్ర సామ్రాజ్యం గోదావరి వరకు విస్తరిస్తుంది. కఠినాత్ములు బహమనీల వల్ల మన హిందూమతానికి ముప్పు వస్తున్నది.
మీరంతా ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన వీరులు. ఈ మహమ్మదీయ సైన్యాన్ని ఎన్నిసార్లో తరిమి కొట్టినవాళ్ళు. విజయనగర రాజ్య ప్రతిష్ట కోసం మీ తాత తండ్రులెన్నో త్యాగాలు చేశారు. మీలో నిజంగా వీర రక్తం ప్రవహిస్తుంటే ఈ తురక సైన్యాన్ని తరిమి కొట్టండి. ప్రాణమున్నంత వరకు మర్యాద కోసం పోరాడుదాం’’ అనే రెచ్చగొట్టే ఉపన్యాసమిచ్చాడు.
మహమ్మదీయ బలగాలు గతితప్పే స్థితిలో అకస్మాత్తుగా మహమ్మదీయ అగ్రభాగ పిరంగిని రాగి నాణాల సంచులతో దట్టించి పేల్చటంతో ఐదువేల మంది హిందువులు ఒక్కసారిగా నిహతులయ్యారు. రామరాయల సైన్యం అయోమయంలో పడింది. ఈలోపు బహ్మనీల అశ్వదళం రాయలున్నచోటికి దూకింది.
రామరాయ లు తనచోటు మార్చి మళ్ళీ శిబికను అధిరోహించాడు. నిజాంషాకు చెందిన కల్లు తాగించబడిన మదపుటేనుగొకటి యుద్ధక్షేత్రంలో రామరాయలు శిబిక వైపు దూసుకుపోయింది. భయపడిన శిబిక వాహకులు భారాన్ని నేలపై పడేసి పారిపోయారు. రామరాయలు తేరుకొని గుర్రాన్ని అధిరోహించేలోపు మిత్రపక్షాల సైనికదళం అతన్ని చుట్టుముట్టి బందీని చేశాయి.
దీనితో విజయనగర సైన్యం భయపడి లొంగిపోసాగింది. రామరాయలను సుల్తాను ఎదుట ప్రవేశపెట్టారు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి