ఆంధ్రప్రదేశ్‌

లోటు తీరేదెలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: మరో ఆరు రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కేంద్ర నిధులపై రాష్ట్ర ఆశలు పెరుగుతున్నాయి.
రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు గత ఏడాది మాదిరిగా కేంద్రం నిధులను విదిలిస్తుందా లేక కుమ్మరిస్తుందా అనే దానిపై టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలోని మకాం వేసి కేంద్రంపై నిధుల కోసం వత్తిడి పెంచుతోంది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన రూ.16,200 కోట్ల లోటును భర్తీ చేస్తామని ఏపి పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.
ఇటీవల కంప్ట్రోలర్ ఆడిట్ జననల్ కార్యాలయం ఆడిట్ జరిపి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 13,787 కోట్ల లోటు ఉందని, దీనిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ధృవీకరిస్తూ సిఫార్సు చేసింది. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం రూ. 2300 కోట్ల నిధులను ఇచ్చి చేతులు దులుపుకుంది. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను నిర్దేశించిన పథకాలకు కాకుండా రైతు రుణమాఫీ, ఇతర పద్దులకు మళ్లించి ఖర్చుపెడుతున్నట్లు ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్రానికి పలు దఫాలు హెచ్చరించింది. ఇంతవరకు రాష్ట్రానికి కేటాయించిన నిధుల ఖర్చుపై వినియోగ పత్రాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది.
రెవెన్యూ లోటు భర్తీకి రూ. 2500 కోట్లు విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు ఖర్చుపెట్టిన నిధులను చెల్లించాలని, రాజధాని నిర్మాణం నిదులు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని కేంద్రంపై రాష్ట్రం వత్తిడి పెంచుతోంది. ఇంతవరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విడుదలపై ఎటువంటి సానుకూల సంకేతాలు అందలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ మేరకు నిధులను ఆర్ధిక శాఖ కేటాయిస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ చేసేదేమీ ఉండదని ఆర్ధిక శాఖ అధికారులంటున్నారు. ద్రవ్యవినిమయ చట్టం మేరకు ఆర్ధిక శాఖ వ్యవహరిస్తుందంటున్నారు.
రైతుల రుణమాఫీకి నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్రం నుంచి నిధులు వస్తే ఈ నిధులతో రుణమాఫీని ఈ ఏడాదికి గట్టెక్కించాలని రాష్ట్రప్రభుత్వం ఆత్రుతపడుతోంది. కేంద్రం రాష్ట్రాలకు మొత్తం పన్నుల్లో 42 శాతాన్ని, 14 శాతాన్ని రాష్ట్ర ప్రణాళికకు ఆర్ధిక సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు గత ఏడాది మాదిరిగానే రూ. 2500 కోట్ల లోపల నిధులను మార్చి 31 తేదీలోగా విడుదల చేయవచ్చని ఆర్ధిక శాఖ భావిస్తోంది.