కడప

పోలీసుల బందోబస్తునడుమ గ్రాస్‌ల్యాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 30: పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీలోఉన్న గ్రాస్‌ల్యాండ్ స్థలం ఎన్నోయేళ్లుగా మరుగునపడి ప్రస్తుతం తెరపైకి వచ్చిన విషయం తెలిసిన విషయమే. గ్రాస్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేసేందుకు గతంలో కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థలం కేటాయించడ జరిగింది. కానీ ఆనాటి నుంచి గ్రాస్‌ల్యాండ్ నిర్మాణానికి నోచుకోలేదు. కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెందుతున్నాకొద్దీ కొంతమంది గ్రాస్‌ల్యాండ్‌కు కేటాయించాల్సిన స్థలాన్ని ఇదిమాది ఇదిమాది అని ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి గ్రాస్‌ల్యాండ్ స్థల ప్రాంగణంలో నిర్మించుకున్న దుకాణదారులు, ఇతర వ్యాపారస్థుల నుంచి ఆ యజమానులు నెలనెలా అద్దెకూడా వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గ్రాస్‌ల్యాండ్ స్థలంలో గ్రాస్‌ల్యాండ్‌ను నిర్మించాలని ఇతర కట్టడాలను తొలగించాలని పైస్థాయి కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చింది. గత జూలై 27న మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులతో కలిసి సంబంధిత దుకాణదారులకు నోటీసులు ఇచ్చారు. నెల రోజులు గడువు ఇస్తూ ఈ గడువులోపు స్వచ్ఛంధంగా దుకాణాలను తొలగించాలని పేర్కొనబడింది. అలా తొలగించని యెడల ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 192, 193, 194 కింద ఎలాంటి నోటీసులు జారీచేయకుండా దుకాణాలను, అక్రమ కట్టడాలను తొలగించి అందుకయ్యే ఖర్చును కూడా దుకాణదారుల నుంచి రాబట్టబడునని పేర్కొనబడి ఉంది. కానీ గడువు ముగిసినప్పటికీ ఏ ఒక్క దుకాణాన్ని తొలగించిన సందర్భమే లేదు. ఈ గ్రాస్ ల్యాండ్ స్థలంపట్ల మున్సిపల్ అధికారులకు ఎలాంటి సంబంధంలేదని, కో ఆపరేటివ్ సొసైటీ తరపునే గ్రాస్‌ల్యాండ్‌కు స్థలం కేటాయించబడిందని, గ్రాస్ ల్యాండ్ స్థలాన్ని మేమే స్వాధీనం చేసుకుని గ్రాస్‌ల్యాండ్ నిర్మాణం చేపడతామని కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు తెరపైకి తీసుకువచ్చారు. ఇదే విషయమై ఇటీవల సొసైటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ విషయమై ఆదివారం అర్బన్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రాస్‌ల్యాండ్ స్థల ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఐతో పాటు ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌లతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. కొద్దిసేపటికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్‌లు కౌన్సిలర్లతో కలిసి అక్కడకు వచ్చారు. త్వరలో ఈ కట్టడాలను తొలగించాలని, గ్రాస్‌ల్యాండ్ స్థలాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేస్తామని వారుతెలిపారు. ఇక్కడ ఎవరూ ఎలాంటి విషయాలపై చర్చించకూడదని అర్బన్ సీఐ చంద్రశేఖర్ వారితో తెలిపారు. చట్ట ప్రకారం మేము నడుచుకుంటామన్నారు. అదేవిధంగా అక్కడకు జనసంఖ్య అధికంగా చేరడంతో వారందరినీ పోలీసులు అక్కడ నుంచి పంపివేయడం జరిగింది. కొద్దిసేపటికి కౌన్సిలర్ దశరథరామిరెడ్డి గ్రాస్‌ల్యాండ్ స్థలం వద్దకువచ్చి ఇది సొసైటీకి సంబంధించిన గ్రాస్‌ల్యాండ్ స్థలమని, దీనిని మా సొసైటీ సహకారంతోనే నిర్మాణంచేపట్టి అభివృద్ధి చేస్తామన్నారు. ఉదయం నుంచి గ్రాస్‌ల్యాండ్ ప్రాంగణంలో పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు. ఇదే తరుణంలో కొంత మంది దుకాణదారులు స్వచ్ఛంధంగా తమ కట్టడాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాస్‌ల్యాండ్‌కు సంబంధించిన స్థలంలో ఎలాంటి ఆక్రమణదారులు ఉండరాదని స్వచ్ఛంధంగా మీ దుకాణాలను తొలగించాలని దుకాణదారులకు పోలీసులు అధికారులు తెలియజేశారు. బందోబస్తులో అర్బన్ సీఐ చంద్రశేఖర్‌తో పాటు ఎస్‌ఐలు మైనుద్దీన్, గోవిందరెడ్డి, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు.
రాష్ట్రంపై మోదీ దుష్టశక్తులు
* జగన్, పవన్‌పై మార్కెట్‌యార్డు ఛైర్మన్ ధ్వజం
రాయచోటి, సెప్టెంబర్ 30: దక్షిణాదిన బీజేపీ పార్టీకి ఉనికిలేకుండా పోతుందనే అక్కసుతోనే ప్రధాని మోదీ ఈ ప్రాంత కీలకనేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తప్పుడు ఆరోపణలుచేస్తూ రాజకీయంగా అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మార్కెట్‌యార్డు ఛైర్మన్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గాజుల ఖాదర్‌బాష పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి జేడీయూ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత తెలంగాణాలో మహాకూటమి ఆవిర్భావానికి చంద్రబాబే కారణం కావడంతో మోదీ ఓర్వలేకపోతున్నారన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం ఎంతటికైనా పోరాడతామని చెప్పిన ప్రధాని నాలుగేళ్లు కాలయాపనచేసి టీడీపీ బీజేపీతో మైత్రిబంధాన్ని తెగతెంపులు చేసుకున్నాక శత్రువుగా చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపాగ్నిలో బీజేపీ రాష్ట్రంలో ఏ ఒక్కచోట కూడా కనీస డిపాజిట్లు దక్కించుకోలేక పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. ఓవైపు జగన్‌ను మరోవైపు పవన్‌ను టీడీపీ వ్యతిరేకంగా రెండు దుష్టశక్తులుగా తయారుచేసి ప్రజల్లోకి వదిలిన నీచసంస్కృతికి పాల్పడటం మోదీ స్థాయికి తగదన్నారు. జనసేన, వైకాపా వల్ల అటు రాష్ట్ర ప్రజలకు కానీ, ఇటు ఆ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు కానీ ఏమాత్రం విలువ ఉండబోదన్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్రలో అవినీతి మచ్చలేని ఏకైక నాయకుడు చంద్రబాబు కాగా ఓటుకు నోటు వ్యవహారంలో దోషి అంటూ ప్రకటనలుచేసే నేతలంతా ప్రజల్లో అభాసుపాలు అవుతారే తప్ప మరొకటి జరగదన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న చంద్రబాబు మరోసారి సీఎం కావడం తథ్యమని, అలాగే రాయచోటి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికోసం కూడా నిరంతరం కృషిచేస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి ఎమ్మెల్యే కావడ తథ్యమన్నారు.