సింధు బయోపిక్‌లో...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు సోనూసూద్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీవితం ఆధారంగా ఒక బయోపిక్‌ను నిర్మించనున్నారని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లేదా ఫిబ్రవరిలో కానీ ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు సోనూసూద్. చిత్రాన్ని కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా మిగిలిన భాషల్లోనూ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బయోపిక్‌లో సింధు పాత్రలో ఎవరు నటిస్తారు? అనే అంశంపై యూత్‌ను సంప్రదిస్తామని, వారు ఎవరిని రిఫర్ చేస్తే వారిని తీసుకుంటామన్నారు. ఒకవేళ సింధూనే నటించాలని ప్రేక్షకులు అడిగితే ఆమెను తీసుకుంటామన్నారు. సింధూ నటిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆమెకు ఇష్టం లేకపోతే కొద్దిసేపైనా ఆమె సినిమాలో కనబడేలా చూస్తామని సోనూ వెల్లడించారు.