26న వీరభోగ వసంతరాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జనరేషన్ హీరోల్లో నారా రోహిత్ ట్రాక్ వేరు. అతని రికార్డులూ వేరు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు చేస్తున్న హీరో నారా రోహిత్ అనిపించుకున్నాడు. తాజాగా వీరభోగ వసంతరాయలు అంటూ స్క్రీన్‌కు వస్తున్నాడు. ఈనెల 26న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్, శ్రీయసరన్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు కీలక పాత్రధారులు. చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కిస్తున్నాడు. చిత్రం విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేసిన దర్శక నిర్మాతలు, ట్రైలర్ డేట్‌నూ త్వరలోనే చెప్తామంటున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన వీరభోగ వసంతరాయలు టీజర్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో సాగుతున్న భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హీరో హీరోయిన్ల ఫస్ట్‌లుక్స్‌కూ మంచి స్పందన రావడంతో, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుంటే, ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ అందించాడు. బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావు బెల్లన వీరభోగ వసంతరాయలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.