చీకటి ప్రవర్తనకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీ టూ -ప్రకంపనలు బలపడుతున్నాయి. తనుశ్రీ దత్తా -నానా పటేకర్ వివాదంతో బీ-టౌన్‌లో రాజుకున్న అగ్గికి, కంగన ఆజ్యం పోయడంతో వివాదం ముదురుతోంది. క్వీన్ ప్రాజెక్టు టైంలో దర్శకుడు వికాశ్ భల్ నుంచి తనకెదురైన లైంగిక వేధింపుల దారుణాన్ని కంగన రనౌత్ బయటపెట్టడం తెలిసిందే. కంగన్ స్నేహితురాలి పాత్ర పోషించిన నాయినీ దీక్సిత్ సైతం షూటింగ్ టైంలో దర్శకుడి నుంచి ఎదురైన చేదు అనుభవాల గుట్టువిప్పింది. ఈ కోణంలోనే తమకూ ఎదురైన లైంగిక వేధింపుల ఘటనలను ఆషా సైనీ, గాయని చిన్మయి బహిర్గతం చేశారు. పరిశ్రమలో చీకటి ప్రవర్తనపై రోజుకొక్కరుగా గొంతు విప్పుతుండటంతో -బీ టౌన్‌లో దుమారం రేగుతోంది. -స్క్రీన్ వెనుక చీకటి ప్రవర్తనలు ప్రస్తుతం బీ టౌన్‌ను కుదుపేస్తున్నాయి. ఈరోజు సరే, రేపెవరి వ్యవహారం బయటపడుతుందోనన్న టెన్షన్ లేకపోలేదు. ఇదిలావుంటే, లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొన్న క్వాంటమ్ ఫిల్మ్స్ భాగస్వామి, సహ నిర్మాత వికాశ్ భల్‌కు కష్టాలు మొదలయ్యాయి. రణవీర్ సింగ్ ప్రాజెక్టు నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చిందన్నది తాజా సమాచారం. క్వీన్ షూటింగ్ టైంలో దర్శకుడు వికాశ్ భల్ అనేకసార్లు అనుచితంగా ప్రవర్తించాడన్న నాయిని దీక్సిత్ వేదన -్భల్ మెడకు బలంగానే చుట్టుకుంది.
క్వీన్ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్‌లో వికాశ్ భల్ ఓ భాగస్వామి. ఇప్పుడు రణవీర్ చేస్తున్న ‘83’ ప్రాజెక్టునూ క్వాంటమ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీంతో అభియోగాలు ఎదుర్కొంటున్న వికాశ్ భల్‌ను టీంనుంచి తప్పించేందుకు సహ భాగస్వాములు నిర్ణయించారన్నది తాజా సమాచారం. ఇప్పటికే ఆ విషయాన్ని మిగతా భాగస్వాములైన అనురాగ్ కశ్యప్, విక్రమాధిత్య మోత్వానీ, మధు మంతెనలు భల్‌కు స్పష్టం చేశారన్నది బీ టౌన్‌లో వినిపిస్తోన్న మాట. ఇంతకుముందే దర్శకుడు భల్ చేతిలోని చిత్రాలన్నీ మాయమైతే, ఇప్పుడు సహ నిర్మాతగానూ రణవీర్ ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టేశారన్న వాదన బలంగానే వినిపిస్తోంది. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులతో తాను పనిచేయలేనంటూ లైంగిక వేధింపులపై హృతిక్ రోషన్ స్పందించడంతో, అతను హీరోగా చేయనున్న ‘సూపర్ 30’ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతల నుంచి వికాశ్ భల్‌ను దాదాపుగా తప్పించేశారు.
ఇదిలావుంటే, లైంగిక వేధింపుల తతంగాన్ని నిబ్బరంగా బయటపెట్టిన తనుశ్రీ దత్తాతు మద్దతు పెరుగుతూనే ఉంది. తాజాగా తనూవెంట తనుంటానంటూ సోహా అలీఖాన్ ప్రకటించింది. ‘ఏ భారతీయ మహిళా తట్టుకోలేని కష్టాలివి. వృత్తి ప్రదేశాల్లో తనకెదురవుతున్న దారుణ పరిస్థితులపై మహిళ గొంతువిప్పడం గొప్ప విషయం. ఏ ఒక్కసారో కాదు, నిత్యం అనేక ప్రాంతాల్లో అనేకమంది మహిళలు ఎదుర్కొంటున్న కష్టమిది. ఈ దారుణాల గుట్టువిప్పేందుకు తెగువ చూపుతోన్న బాధితులకు మనం మద్దతు పలకాలి. ఇలాంటి వెతలు ఎదుర్కొన్న బాధిత వర్గానికి అండగా నిలబడేందుకు నేను ముందుకొస్తున్నా’ అంటూ ఓ మీడియా ఇంటరాక్షన్‌లో సోహా ప్రకటించింది. ‘నటిగానే కాదు, ఓ మహిళగా లైంగిక వేధింపుల కథనాలు వింటున్నపుడు, పత్రికల్లో చదుపుతున్నపుడు కోపంతో కడుపు రగిలిపోతుంది. ఒక్కోసారి అలా జరిగిందా? అన్న ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి. ఇది మరీ దారుణం. ఒక మహిళ తనకెదురైన చేదు అనుభవాన్ని చెప్పగలుగుతుందే తప్ప, కట్టుకథలు కాదు’ అంటూ నేహా ధూపియా స్పందించింది. ‘పదేళ్ల క్రితం జరిగిన దాన్ని తనుశ్రీ దత్తా ఇప్పుడే ఎందుకు బయటపెడుతుంది? అన్న ప్రశ్నలూ కొందరినుంచి వినిపిస్తున్నాయి. భయానకమైన కష్టాన్ని ఎదుర్కొన్నానంటూ ఒక మహిళ తెగువతో చెబుతుంటే పట్టించుకోకుండా, ఎప్పుడో కథ ఇప్పుడెందుకంటూ ప్రశ్నించడానికి సిగ్గుపడాలి. ఇలాంటి విషయాలను ఏ మహిళా పబ్లిసిటీ కోసం చెప్పుకోదు’ అంటూ సోఫియా చౌదరి ప్రకటించింది. వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు తానూ మద్దతుగా నిలుస్తానంటూ సమంత సైతం ప్రకటించింది. తానూ వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసిన చిన్మయి శ్రీపాద, సమంతకు మంచి స్నేహితురాలు కావడం తెలిసిందే. లైంగిక వేధింపుల కథనాలపై సమంతా ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘తనకెదురైన దారుణ పరిస్థితులపై మహిళ గొంతు విప్పడంపట్ల సంతోషం కలుగుతుంది. మీ ఉద్యమానికి నేనూ అండగా ఉంటా’నంటూ సమంత ట్వీట్ చేసింది.