ఫస్ట్.. రెమ్యూనరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ గ్రాఫ్ క్రేజ్ తగ్గింది. కొత్తందాల దూకుడుతో అలవాటైన అందగత్తెలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఆ జాబితాలో కాజల్ సైతం ఉంది. దాదాపు దశాబ్దంపాటు టాప్ హీరోయిన్ అనిపించుకున్న కాజల్, గ్లామర్‌తోపాటు నటిగానూ క్రేజ్ తెచ్చుకోవడం తెలిసిందే. దాదాపు రెండు కోట్ల పారితోషికానికి చేరిన కాజల్, ఆమధ్య అవకాశాలు తగ్గడంతో డిమాండ్‌ను బాగా తగ్గించేసింది. తెలుగు, తమిళ భాషల్లో మళ్లీ అవకాశాలు పుంజుకోవడంతో రెమ్యూనరేషన్‌ను యాజిటీజ్ చేసిందని వినికిడి. తాను డిమాండ్ చేసిన పారితోషికం చెల్లిస్తే, కెమిస్ట్రీని చూడకుండా ఏ హీరోతోనైనా ఓకే అంటోంది చందమామ. కుర్ర హీరోల సరసనా వస్తోన్న అవకాశాలతో అమాంతం ఇమాండ్ పెంచేయడంతో, నిర్మాతలు బాబోయ్ అంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే సినిమా చేసేది లేదని తెగేసి చెప్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న కాజల్, ఈ సినిమా కోసం ఏకంగా ఈ రేంజ్‌లోనే రెమ్యూనరేషన్ తీసుకుందని అంటున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. సో ఇకపై కాజల్ హీరోయిన్‌గా కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.