ప్రభాస్ ఆమూర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు 70శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో సినిమాకి ఓకే చెప్పాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో తెరకెక్కనున్న సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ ఆసక్తికర టైటిల్ ఏమిటో తెలుసా. ఆమూర్! షాకవ్వకండి. ఆమూర్ అంటే ఫ్రెంచ్ భాషలో ప్రేమ అని అర్థం. ఈ సినిమా అచ్చమైన ప్రేమకథగా తెరకెక్కుతుంది. అదీ 1980 నేపథ్యానికి కావడం విశేషం. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డేని ఎంపిక చేసారు. త్వరలో షూటింగ్ పూర్తిచేసి వచ్చే దసరాకు విడుదల చేస్తారట.