ఆంధ్రప్రదేశ్‌

తరచూ తుపాన్ల బారిన పడే రాష్ట్రం ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: భౌగోళికంగా తరతూ తుపాన్ల బారిన పడే రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విపత్తుల వచ్చినా అధైర్యపడమని, ధైర్యంగా నిలబడి పరిస్థితులు చక్కదిద్దుకుంటామని వ్యాఖ్యానించారు. తిత్లీ తుపాను సహాయ చర్యలపై శ్రీకాకుళం నుంచి ఆయన శనివారం అధికారులతో, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిసీమ తుపానులో 10వేల మంది చనిపోయారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుపాను వల్ల 2500 మంది చనిపోయారని గుర్తు చేశారు. అయితే హుదూద్ తుపాను సమయంలో ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించామన్నారు. తిత్లీ తుపానులో కూడా ప్రాణ నష్టాన్ని నియంత్రించగలిగామన్నారు. అన్ని క్లస్టర్లు, మండలాల్లో నోడల్ అధికారులను, స్పెషల్ అధికారులను నియమించామన్నారు. డిప్యూటీ కలెక్టర్లు ఇప్పటికే పొజిషన్‌లో ఉన్నారని తెలిపారు. ఐఏఎస్ అధికారులు కూడా వెంటనే చేరుకోవాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులు ఇక్కడే ఉన్నారన్నారు. సెక్రటేరియట్ అంతా సిక్కోలుకు తరలివచ్చిందన్నారు. సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్లు బాగు చేశారని 31 శాతం మంది మాత్రమే చెప్పారన్నారు. 69 శాతం మంది ఇంకా చేయాలని చెప్పారని గుర్తు చేశారు. అన్నింటినీ త్వరగా పూర్తి చేయాలన్నారు. పునరావాస చర్యల్లో గ్రామస్థులను భాగస్వాములను చేయాలని, హుదూద్ స్ఫూర్తితో అందరూ చురుగ్గా పని చేయాలన్నారు. ప్రజల్లో 95 శాతం సంతృప్తి రావాలన్నారు. బాగా పని చేశారన్న ప్రశంస ప్రజల నుంచి రావాలని తెలిపారు. పలాస, ఉద్దానం ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తేవాలన్నారు. బాగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తామని, ప్రతి గ్రామంలో మంచినీటికి జనరేటర్లు ఉపయోగించాలని, 22 పీహెచ్‌సీలకు వెంటనే జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందరూ రేయింబవళ్లు పని చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తరలించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి తేవాలన్నారు. అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలన్నారు. పంచాయతీరాజ్ రహదారులను శని, ఆదివారాల్లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దెబ్బతిన్న టవర్లను పునరుద్ధరించి, సమాచార వ్యవస్థను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటలకల్లా 196 గ్రామాలకు సంచార వైద్యశాలలు చేరుకోవాలని స్పష్టం చేశారు. కిడ్నీ పేషంట్లకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, డయాలసిస్‌పై దృష్టి సారించాలన్నారు. బియ్యం, సరకులు రెండు ప్యాకెట్లుగా సరఫరా చేయాలని, చిన్నారులకు పాలు పంపిణీ చేయాలన్నారు. చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. విపత్తులు నష్టం చేశాయని అధైర్యపడవద్దని, వాటిని అధిగమించే సత్తా మనకు ఉందని నిరూపించాలని దిశానిర్దేశం చేశారు.

సెల్ సర్వీస్ ప్రొవైడర్లపై ఆగ్రహం
సమీక్షా సమావేశానికి సెల్ సర్వీస్ ప్రొవైడర్లు హాజరు కాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చోట్ల త్వరితగతిన సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని ఆదేశించారు. దెబ్బతిన్న టవర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయానికి మంచినీటి కొరత లేకుండా చేయాలన్నారు. మందసలో దెబ్మతిన్న రోడ్లను శరవేగంగా నిర్మించాలని, ఆహారం కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. మరమ్మతు పనులు చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు.