సబ్ ఫీచర్

చెట్లకు మహిళల కాపలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటి పిల్లలకు అడవి అంటే ఏమిటో తెలియని పరిస్థితి. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు.. ‘అనగనగా ఓ అడవి..‘ అనో, ‘ అది కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి2 అనో పిల్లలకు కథలు చెప్పేవారు. కానీ నేడు కాంక్రీటు అరణ్యాలు పెరగడంతో అడవులు దాదాపుగా కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని ప్రేమించేవారు తప్ప.. మిగిలినవారు అడవుల గోడు పట్టించుకునేవారే లేరు. ఇలాగయితే రాబోయే తరాల పరిస్థితి ఏంటి? అనుకున్నారో.. ఏమో..? పశ్చిమ బంగా, బంకురా జిల్లా పరిధిలోని హకీం సినాన్ గ్రామ మహిళలు చెట్లను కాపాడుకోవడానికి నడుం కట్టారు. ఎంతగా అంటే.. పూర్తిగా ఆదివాసీ గ్రామాల్లో ఉండే ఈ మహిళలు చెట్లను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టేంతగా..
చెట్లను కొంతమంది ప్రకృతి ప్రేమికులు కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని వారు చెట్లను దేవుళ్ళలా కొలుస్తారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాధులకు చెట్టు పసరులనే మందులుగా వాడతారు. వారికి ప్రకృతి వనరులే జీవనాధారం.. అలాంటి కోవకు చెందినవారే.. హకీం సినాన్ గ్రామానికి చెందిన మహిళలు. వీరు జనజీవనానికి చాలా దూరంలో ఉంటారు. పశ్చిమ బంగాలో అత్యధిక అడవులుండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలను ప్రకృతే కల్పిస్తుంది. ఇక్కడి వాళ్లకి వనమూలికలు, వైద్య గుణాలున్న వేర్లు, తేనె, వివిధ రకాల పండ్లే జీవనాధారం. ఇక్కడ సాంతాలు అనే గిరిజన తెగకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఎన్నో అరుదైన రకరకాల చెట్లు ఉన్నాయి. దీంతో స్మగ్లర్లు రాత్రి వేళల్లో ఆ చెట్లను నరికి తీసుకెళ్ళడానికి వస్తుంటారు. కొన్నాళ్ల కిందట ఓ స్మగ్లర్ల గుంపు వచ్చి చెట్లను నరకడం ఆ తండాలోని ఓ వ్యక్తి చూశాడు. వాళ్లను అడ్డుకున్నాడు. ఆ స్మగ్లర్లు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనతో కలత చెందిన అక్కడి మహిళలు అప్పటినుంచి రాత్రి సమయంలో ఓ బృందంగా ఏర్పడి చెట్లను కాపాలా కాస్తున్నారు.
ఒకవేళ రాత్రివేళ ఎవరైనా స్మగ్లర్లు చెట్లు నరకడానికి వస్తే వాళ్ల అలికిడి తెలుసుకోవడానికి ఓ కోడ్ భాషను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వెంటనే స్పందించి స్మగ్లర్లు చెట్ల దాకా రాకుండా కాపలా కాస్తున్నారు. అలాగే ఇక్కడివారు ఒక్కోప్రాంతాన్ని ఒక్కో బృందం దత్తత తీసుకున్నారు. వారి పరిధిలోని మొక్కలకు ఎలాంటి హానీ కలగకుండా చర్యలు తీసుకోవడం ఆ బృందం బాధ్యత. రాత్రివేళ వీరికి భయపడి పగలు చెట్లను నరకడానికి వచ్చినవారికి ఈ మహిళలు మాటలతోనే బుద్ధి చెప్పడం మొదలుపెట్టారు. పాలిచ్చి పెంచిన తల్లిని ఎవరైనా చంపుకుంటారా? అలాగే మేం కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ఈ చెట్లను మీరు ఎలా నరుకుతారు? నరికితే మేము ఊరుకుంటామా? నమ్మిన దేవుడిని ఎవరైనా కూలుస్తారా? అలాగే మేం దైవంగా పూజించే ఈ చెట్లను ఎలా కూలుస్తారు? అని నెమ్మదిగానే హెచ్చరిస్తున్నారు. వీరి తెలివితేటలను మెచ్చుకున్న ప్రధాన్ అనే సంస్థ వీరి మాటలకు బ్యానర్ల రూపాన్నిచ్చింది. వాటినే అడవిలో అక్కడక్కడా కట్టించింది. చెట్ల మనుగడకు వీళ్లు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. ఈ మన్యం ప్రజలకు సాయం చేయాల్సిందిగా కొందరు ఫారెస్ట్ అధికారులను నియమించింది. అటు అధికారులు, ఇటు మన్యం ప్రజల సహకారంతో ఆ చెట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ, అందరికీ స్వచ్ఛమైన ఊపిరిని అందిస్తున్నాయి. *