రాష్ట్రీయం

అవకాశం ఇవ్వండి... రాజన్న రాజ్యం తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, అక్టోబర్ 21: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పిస్తే మళ్లీ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా రామభద్రపురం మండల కేంద్రంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ముందుగా పారాది బ్రిడ్జి నుంచి కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. మధ్యాహ్నం విడిది అనంతరం రామభద్రపురం పురవీధుల గుండా సాగిన పాదయాత్రలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెనుకబడి ఉందని ఆరోపించారు. పాదయాత్రలో అప్పలరాజుపేట, గొల్లలపేట రహదారులు అధ్వాన్నంగా ఉందని గ్రామ యువకులు జగన్‌కు వినతిపత్రాన్ని అందించారు. దశాబ్ధాల కాలంగా ఈ రహదారి మరమ్మతులకు గురైన పాలకులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. అలాగే జన్నివలస రహదారి కూడా అధ్వాన్నంగా తయారైందని జగన్‌కు విన్నవించారు. కొనసాగిన పాదయాత్రలో వృద్ధులు, చిన్నారులను హత్తుకున్నారు. అలాగే యువతీయువకులు జగన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీపడ్డారు. పాదయాత్రలో ఒక అభిమాని ఫ్యాన్ గుర్తుతో ఉన్న సైకిల్‌తో ప్రచారం చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నాయకులు జోగి రమేష్, మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చిత్రం..రామభద్రపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు అబివాదం చేస్తున్న జగన్