ఆంధ్రప్రదేశ్‌

గృహ నిర్మాణంలో అంతంతమాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ప్రగతి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. భారీ ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఆశించిన స్థాయిలో లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 93,962 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం 47,782 ఇళ్లను పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే బడ్జెట్ ప్రణాళిక ప్రకారం కేటాయించిన రూ. 922.70 కోట్ల నిధుల్లో మాత్రం రూ. 759.86 కోట్లు ఖర్చయిపోయాయి. ప్రణాళికేతర కింద రూ. 1,171.11 కోట్లు కేటాయిస్తే, ఖర్చు చేసింది రూ.933.54 కోట్లే. కాగా, ప్రస్తుత 2016-17 బడ్జెట్‌లో ప్రణాళిక కింద రూ. 1,000 కోట్లు కేటాయించి, 73,127 ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని గృహ నిర్మాణ శాఖ శాసనసభకు ప్రతిపాదించింది. ఈ ఇళ్లలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 3,305, ప్రధాన మంత్రి గృహ యోజన పథకం కింద పట్టణ పరిధిలో 16,050, గ్రామీణ పరిధిలో 53,772 ఇళ్లు కలిపి మొత్తం 73,127 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా చేసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ తన బడ్జెట్‌లో సభ ముందు ఉంచింది.
గత ఏడాది ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో గ్రామీణ విభాగానికి 21,250 ఇళ్లను నిర్మించాలని ప్రతిపాదించి 2016 ఫిబ్రవరి నాటికి 5,447 మాత్రమే పూర్తి చేయగా, పట్టణ విభాగంలో 8,530 ప్రతిపాదించి 2,918 మాత్రమే పూర్తి చేసింది. ఇందిరా ఆవాస్ యోజనలో 64,362 ప్రతిపాదించి 39,417 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. దీంతో 2016-17 లక్ష్యాన్ని ఏ మేరకు పూర్తి చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.