29న రజనీకాంత్ 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ‘రోబో’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కాంబోను రిపీట్ చేస్తూ సీక్వెల్‌గా తెస్తున్న త్రీడీ చిత్రమే 2.0. శంకర్ చెక్కుతున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషనే్స ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారతీయ తలమానిక చిత్రంలా.. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆధునిక ప్రపంచంలో హైటెక్నికల్ వాల్యూస్‌తో హలీవుడ్‌స్థాయిని అందుకునే సాహసంతో ఈ సినిమా రూపొందుతోంది.
లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా విభిన్నమైన పాత్ర పోషిస్తుంటే, ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. కాగా, నవంబర్ 3న చిత్రం ట్రైలర్‌ను చెన్నైలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ విడదలైన 2.0 లుక్స్ అదిరిపోతుండటంతో, ట్రైలర్ ఇంకెంత గొప్పగా ఉంటుందోనన్న అంచనాలు పరిశ్రమను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.