ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దు తరువాత రెండురెట్లు పెరిగిన ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 10: కేంద్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రానివ్వడమంటే దేశాన్ని ఫణంగా పెట్టడమేనని, చంద్రబాబుకు నిజంగా బీజేపీని ఓడించాలని ఉంటే ఎన్‌డీఏలో ఉన్న ఆ పార్టీ మిత్రులను దూరం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యు లు బీవీ రాఘవులు సవాల్ చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన సీపీఎం ప్రాంతీయ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నితీష్‌కుమార్, ఉద్దవ్‌థాకరే, రాంవిలాస్ పాశ్వాన్ లాంటి అనేక మంది ఇంకా బీజేపీతోనే ఉన్నారని, అటువంటి వారిని బీజేపీకి దూరం చేస్తే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబుకు సూచించారు. దేశ స్థాయిలో కూటముల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయడం ద్వారానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయగలుగుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలుస్తున్న వారందరూ ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారేనని అన్నారు. ఇప్పుడు చేస్తున్న కూటముల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల సమయంలోనే చంద్రబాబు ప్లేటు ఫిరాయించాడని, అవసరానికి తగట్లు ఆయన మారిపోతుంటారన్నారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు స్వయంగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో మతోన్మాదాన్ని, రామమందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకొస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలో లౌకికవాదాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే మార్గమని అన్నారు. మైనార్టీలు, దళితులే పార్టీ బలం అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్ దేశంలో వారిని ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారన్నారు. బీజేపీ తీరుపై వైసీపీ వౌనముద్ర నటిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడం రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారానే సాధ్యమని రాఘవులు అన్నారు.

చిత్రం..సీపీఎం సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు