ఆంధ్రప్రదేశ్‌

ఏపీపీఎస్సీ థ్వారా 800 ఖాళీల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 800 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనం-మనం కార్యక్రమం కింద 27 కోట్ల మొక్కలు నాటించామని తెలిపారు. నవంబర్ 23న ముగింపు కార్యక్రమం ఉంటుందని, కార్తీక వన సమారాధన కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఏ జిల్లాల్లో నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. ప్రతి శనివారం ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది విస్తృతంగా మొక్కలు నాటడం వల్ల జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లను, ట్రెంచ్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. చెట్ల మధ్య ఇళ్లు ఉండాలన్న సీఎం ఆదేశాల మేరకు నగర వనాలు, పల్లె వనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతి జంతు ప్రదర్శన శాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, విశాఖ జంతు ప్రదర్శన శాఖ అభివృద్ధికి కూడా 75 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద కూడా అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్ తరహాలో జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు వీలుగా నివేదిక సిద్ధం చేస్తున్నారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 12వ విడత 772 టన్నుల ఎర్ర చందనాన్ని నెల 27, డిసెంబర్ 4న వేలం వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 5489 టన్నుల ఎర్ర చందనాన్ని అమ్మగా, 1483 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చిందన్నారు. 2.7 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 250 తుపాకులు, 125 రివాల్వర్లను త్వరలో సిబ్బందికి అందచేయనున్నట్లు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. బాలల సైన్సు కాంగ్రెస్-2018ని డిసెంబర్ 2,3 తేదీల్లో కేఎల్ వర్సిటీలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు.