క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, నవంబర్ 17: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రామానికి చెందిన తడికమళ్ల సంజీవరావు(49)అనే వ్యక్తి ఉదయానే్న పాలు తీసుకొని రావటానికి తిమ్మారావుపేట గ్రామం నుండి రాజలింగాల గ్రామానికి సైకిలుపై వస్తుండగా అదే సమయంలో రాజలింగాల వైపు నుండి తిమ్మారావుపేట గ్రామానికి వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా వెళ్లి అదుపు తప్పి సంజీవరావును డికొట్టాడు. ఈసంఘటనలో సంజీవరావుతలపై నుండి టాక్టర్ వెనక టైరు ఎక్కి వెళ్లటంతో తలకు బలమైన గాయలైన సంజీవరావు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని కుమారుడు నరేందర్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్‌ఐ పవన్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.