వినూత్నం.. అక్షర ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అహితేజ బెల్లంకొండ, సురేష్‌వర్మలు కలిసి నిర్మిస్తున్న అక్షర చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖులు, ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా ప్రారంభమైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడ ఫేమ్ నందితశే్వత ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా రఘురామకృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. యంగ్ హీరోస్ కార్తికేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కళ్యాణకృష్ణ కురసాల అహితేజకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ నందితశే్వత మాట్లాడుతూ.. నిర్మాతలు సురేష్‌వర్మ, అహితేజల కొత్త ఆలోచనలు నన్ను ఇంప్రెస్ చేశాయి. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు చిన్నికృష్ణకి థాంక్స్. సినిమా అంతా నా పాత్రమీద నడుస్తుంది. మీ అంచనాలను తప్పకుండా అందుకుంటాననే నమ్మకం నాకు టీజర్ షూట్ చేసినప్పుడే కలిగింది అన్నారు. దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ కథను నమ్మి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఎడ్యుకేషన్ వ్యవస్థలోని వాస్తవాలను ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా చెప్పబోతున్నాం. నందితశే్వతతోపాటు మరో మూడు ముఖ్యపాత్రలు కనిపిస్తాయి. వాటిని త్వరలో ప్రకటిస్తాం. ప్రోత్సహించడానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి కృతజ్ఞతలు అన్నారు. మిగతా నటీనటుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, సమ్మర్‌కి రిలీజ్ ప్లాన్ చేస్తాం. మరో నిర్మాత సురేష్‌వర్మ మాట్లాడుతూ.. టీజర్ ఇండస్ట్రీలోను, ఆడియన్స్‌లోను అక్షర మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగించింది. కథ చెప్పగానే నందితశే్వత యాక్సప్ట్ చేసినందుకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి మాట్లాడుతూ.. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథ అన్నారు.