రాష్ట్రీయం

భూతగాదాలకు ఇక చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 20: రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న ఆరు రకాల భూములకు సంబంధించిన సమస్యలను నెలరోజుల వ్యవధిలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 80వేల చుక్కల భూముల కేసులు, 24వేల ఈనాం భూ వివాదాలు, లక్ష వరకు సొసైటీ భూముల కేసులు, ఇంకా వివాదాల్లో ఉన్న ఇతర భూములను నిశతంగా పరిశీలన జరిపి ఎవరి పేరుతో ఉంటే వారికి పట్టాలిచ్చి వివాదాలకు తెరదించుతామని వెల్లడించారు. చుక్కల భూముల సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులకు నెలరోజులు గడువు విధించారు. ఈ గడువులో ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహించి ఆయా భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో విచారించి వారికి యాజమాన్యపు హక్కు కల్పిస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఎవరైనా పైసా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి భూభాగానికి 11 అంకెల విశిష్ట సంఖ్యను అందించే ‘భూధార్’ కార్యక్రమాన్ని మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ‘భూసేవ’ పేరుతో ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా షేర్లు అమ్ముకున్నంత సులభంగా భూ విక్రయాలు జరుపుకోవచ్చన్నారు. భూసేవ ప్రాజెక్ట్‌లో దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూముల వివరాలన్నింటినీ సమీకృతం చేస్తున్నామని చెప్పారు. ఎంతోమంది అధికారుల కష్టంతో భూధార్ ప్రవేశపెట్టామని, ఇదో చరిత్ర అని అభివర్ణించారు. ఈ తరహా ప్రాజెక్ట్ దేశంలోనే తొలిసారని తెలిపారు. ఎన్నో అంశాలకు ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచినట్టే భూధార్‌లో కూడా ఆదర్శం కానుందని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంలో భాగంగానే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. భూధార్ ద్వారా భూములు సురక్షితంగా ఉన్నాయా.. లేదా.. అనేది ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. చివరకు భార్యపేరుతో ఉన్న భూమిని సైతం భర్త దుర్వినియోగం చేసే అవకాశం ఉండదన్నారు. ఆధార్ కార్డులో వ్యక్తుల వివరాలు ఉన్నట్టే భూధార్ కార్డులో భూముల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. భూసేవ ద్వారా ఇకపై ఎలాంటి వివాదాలు ఉండవన్నారు. ప్రతి భూమికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ సహాయంతో భూమికి సంబంధించిన కచ్చితమైన కొలతలు తెలుసుకునే వీలు కలుగుతుంది. దేశంలో ఎవరూ ఊహించని విధంగా భూసేవ ప్రాజెక్ట్ నిలుస్తుందన్నారు. మన భూమిపై ఎప్పుడు అనుమానమొచ్చినా మొబైల్ ద్వారా లేదా కార్డులో తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతికతను కొత్తప్రాజెక్ట్‌లో వినియోగించామని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో నకిలీ సంతకాలకు అవకాశం ఉండదని, వేలిముద్రలు, కనుపాపల ఆధారంగా మనుషులకు ఆధార్ ఇచ్చినట్టే భూములు, ఆస్తుల గుర్తింపు సర్వే నెంబర్లు, సబ్‌డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూదార్ మంజూరవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి అతిపెద్దసమస్య భూ వివాదాలే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ప్రత్యక్షనరకం చూపిన గ్రామాధికార్ల వ్యవస్థను రద్దుచేసి ఎన్టీఆర్ మన్ననలు అందుకున్నారని గుర్తుచేశారు. నవ్యాంధ్రలో అవినీతిని రూపుమాపటానికి రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామని మరోవైపు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని సత్ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. దేశంలో నిత్యం 3కోట్ల మంది వినియోగిస్తున్న ఆధార్ ఏ విధంగా పెనుమార్పులు తెచ్చిందో ఇప్పుడు ఏపీలో ప్రవేశపెడుతున్న భూధార్ కూడా అదే మార్పు తీసుకొస్తుందని ఐటీ సలహాదారు ఉడాయ్ (యూఐడీఏఐ) చైర్మన్ జె సత్య నారాయణ చెప్పారు. భూధార్ కోసం తొలిసారి అత్యాధునిక కోర్స్ టెక్నాలజీ వినియోగించామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూసేవ ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూభాగాల మ్యాప్‌లను అందించేందుకు మొబైల్ ఫోన్‌ల సైజులో ప్రత్యేకమైన డివైస్‌లు ప్రవేశపెట్టామని, రూ 30 నుంచి 60 లోపు ఖర్చుపెట్టి ఈ సేవా కేంద్రాల్లో భూధార్ కార్డు తీసుకునే వీలుంటుందని వివరించారు. రెండు కోట్ల 39లక్షల 69వేల 159 రెవెన్యూ, వ్యవసాయ భూముల్లో ఇప్పటికే కోటీ 39లక్షల భూ భాగాల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి భూధార్ కార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భూ వివాదాలకు తావివ్వరాదనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ‘కోర్స్’ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా శాశ్వత భూధార్ సంఖ్యను కేటాయిస్తామన్నారు. సమావేశంలో సీసీఎల్‌ఏ మన్మోహన్‌సింగ్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, భూసేవ మిషన్ డైరెక్టర్ విజయ్‌మోహన్ తదితరులు అందుకున్నారు. తొలుత ముఖ్యమంత్రి భూసేవ పోర్టల్‌ను, ఈ- భూధార్ మొబైల్ కార్డులను అర్హులకు అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. భూసేవ.ఏపీ.జీవోవి.ఇన్ అనే పోర్టల్ ద్వారా భూసేవ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతుల భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సెక్యూరిటీ పాలసీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.్భసేవ ప్రాజెక్ట్‌కు రూ 26.75 కోట్లు, దీనికోసం రూపొందించిన ‘కోర్స్’ కోసం రూ 32.5 కోట్లు ఖర్చయింది. ఈ సందర్భంగా కొందరు రైతులకు ముఖ్యమంత్రి భూధార్ కార్డులను అందజేశారు.

చిత్రం..ఉండవల్లి ప్రజావేదికలో మంగళవారం భూధార్ కార్డు ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు