టాక్సీవాలాకు మెగా అభినందన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో జిఏ2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్కెఎన్ నిర్మతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్‌తో అన్నిసెంటర్స్లో మంచి కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్కెఎన్ మాట్లాడుతూ పిఆర్ఓగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసి.. నిర్మాతగా టాక్సీవాలా రూపొందించి సక్సెస్ అందుకొని మెగాస్టార్ అభినందనలు అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని నిర్మాత ఎస్కెఎన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. టాక్సీవాలా ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మా చిత్ర యూనిట్‌ని అభినందించడం మరింత బలాన్నిచ్చింది. ఇండస్ట్రీలో ఏదైనా సాధించి ఆయన అభినందనలు పొందాలనే నా ప్రగాఢ కోరిక ఈ చిత్రంతో తీరింది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిని అవుతానని ఆశిస్తున్నానన్నారు.