విజయ్, జాన్వీలతో కరణ్ ఓ సినిమా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాన్వికపూర్‌తో తప్పకుండా నటిస్తానని విజయ్ దేవరకొండ అన్నాడు. ఇటీవల బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షో సందర్భంగా... ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే నువ్వు ఎవరిగా మారాలని అనుకుంటున్నావు? ఎందుకు? అని కరణ్ జోహార్ జాన్విని ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. విజయ్ దేవరకొండ అని, అతనితో కలిసి నటించాలనుందంటూ జాన్వీ సమాధానం ఇచ్చింది. ఈ విషయం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. దీని గురించి విజయ్ దేవరకొండను ఓ ఇంగ్లీష్ మీడియా ప్రశ్నించినపుడు, జాన్వి, కరణ్‌జోహార్‌తో కలిసి త్వరలోనే పనిచేస్తానంటూ సమాధానమిచ్చాడు. ఇటీవల ‘టాక్సీవాలా’ ప్రమోషన్స్‌కోసం ముంబై వెళ్లిన విజయ్, అక్కడ కరణ్‌జోహార్‌ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తుంటే విజయ్, జాన్వీలతో కరణ్ ఓ సినిమా చేస్తున్నాడేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయ.
ఏమో దేవరకొండ బాలీవుడ్‌కు ఎగరావచ్చు.