AADIVAVRAM - Others

అండమాన్ అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లపైన బదులు నేలమీద గూళ్లు కట్టే వింతపక్షులు.. చెంగుచెంగున గంతులేసే విభిన్న వర్ణాల ఎలుకలు.. పొడవైన తోకల్ని ఊపుతూ సందడి చేసే కోతులు.. కాంతులీనే ఆకుపచ్చటి తొండలు.. వివిధ రంగుల్లో మెరిసిపోతూ గాలిలో చక్కర్లు కొట్టే విహంగాలు.. ఇలాంటి జీవజాలంతో అండమాన్, నికోబార్ దీవులు సరికొత్త అందాలతో పర్యాటకులకు నిత్యం స్వాగతం పలుకుతుంటాయి.. జంతుజాలం, వృక్షజాలం వైవిధ్య భరితంగా భాసిల్లుతున్న అండమాన్ దీవులు ప్రకృతి రమణీయతకు ఆలవాలం.. అరుదైన జీవజాలం కారణంగానే అండమాన్ ప్రాంతం పర్యాటకపరంగా విశిష్టతను సంతరించుకొంది.. దేశంలో ఎక్కడా కన్పించని రీతిలో అరుదైన పక్షులు, క్షీరదాలు, సముద్ర జీవులు అండమాన్‌లోనే మనల్ని స్వాగతిస్తాయి.. ఈ ప్రాంతంలో భూ ఉపరితలంపై, సముద్ర గర్భంలో 1,067 అరుదైన పక్షులు, జంతువులు ఉన్నట్టు ‘్భరత జీవశాస్త్ర అధ్యయన సంస్థ’ తాజా నివేదికలో పేర్కొన్నారు. మన దేశ భూ భాగంలో కేవలం 0.25 శాతం విస్తీర్ణంలో ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లో ఇంతటి జీవజాలం ఉండడానికి ఇక్కడి జీవవైవిధ్యమే కారణమని పరిశోధకులు గుర్తించారు. అరుదైన జీవజాలం ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో పర్యావరణానికి చేటు కలిగించే పరిణామాలు అండమాన్, నికోబార్ దీవుల్లో చోటుచేసుకొంటున్నట్లు శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, గనుల తవ్వకం వంటి అంశాలతో ఇక్కడి జీవ వైవిధ్యానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 8,249 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఇక్కడ సుమారు 572 ద్వీపాలున్నాయి. ఎక్కువగా గిరిజన తెగలుండే ఈ దీవుల్లో మొత్తం జనాభా నాలుగు లక్షలే. విదేశీయులను దృష్టిలో ఉంచుకొని ‘రక్షిత స్థలాల’కు వర్తించే ఉత్తర్వులను ప్రభుత్వం కాస్త సడలించడంతో అనధికార నిర్మాణాల జోరు పెరిగింది. పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణ సజావుగా ఉన్నంతకాలం అండమాన్ దీవులు పర్యాటకులకు స్వర్గ్ధామమే.

-ఎస్‌ఆర్