తలెత్తకు.. పని ఆపకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనితో మెప్పించు. పొగరుతో కాదు -ఎంత గొప్ప మాట కదూ. అనుభవజ్ఞుల నుంచి అందే సలహాలు పొడిపొడిగా కనిపించినా లోతెక్కువ ఉంటాయని అంటారు, ఇలాంటి మాటలు చూసే. అందుకే -అక్క చెప్పిన మాటను సందర్భాను సారం గుర్తుచేసుకుంటూ ముందుకెళ్తోంది బాలీవుడ్ స్టార్ ఇసాబెల్లె కైఫ్. ముంబయిలో ఓ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా కార్యక్రమానికి హాజరైన ఇసాబెల్లె -పనిలో పనిగా అక్కడ తనను కలిసిన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. పరిశ్రమలో ఎలా మసలుకోవాలో మీ సిస్టర్ సలహాలేమైనా ఇచ్చారా? అన్న ప్రశ్నకు ఇసాబెల్లె చెప్పిన సమాధానమిదే. ‘పరిశ్రమలో పదికాలాలు రాణించాలంటే తలదించుకుని ఉండాలి. పనితో మెప్పించాలి’ అని సలహా ఇచ్చిందట. అంత గొప్ప సలహా ఇచ్చిన అక్క ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. కెరీర్‌ను ఆరంభించే ముందు అక్క ఇచ్చిన సలహానే ఇప్పటికీ పాటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది ఇసాబెల్లె. ఇసాబెల్లె ప్రస్తుతం ‘టైం టు డాన్స్’ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సూరజ్ పాంచోలితో జోడీ కట్టిన ఇసాబెల్లె -ఓ లాటిన్ బాల్‌రూం డ్యాన్సర్ పాత్రను పోషిస్తుందట. సినిమాలో స్ట్రీట్ డ్యాన్సర్ పాత్రలో కనిపించనున్న సూరజ్ -ఊహించలేనంత గొప్ప డ్యాన్సర్ అంటూ కితాబిస్తోంది. అంతేకాదు, హార్డ్‌వర్డ్‌లో అతన్ని మించినవారు లేరంటూ పొగడ్తలు సైతం గుప్పించింది. షూటింగ్‌లో ఇటు హీరో సూరజ్, అటు డైరెక్టర్ స్టాన్లీ డి’కోస్టా, ప్యాషన్‌తో పనిచేస్తున్న తోటి నటీనటులతో టైమే తెలీకుండా పోతోందని చెప్పుకొచ్చింది. అక్క ముచ్చట్లు చెబుతూ ‘కత్రినా ఫిక్చర్ జీరో కోసం నేనూ మీలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మరుగుజ్జు షారుక్‌తో కత్రినా సన్నివేశాలు ఎంత ఆసక్తిగా ఉంటాయోనని ఎదురు చూస్తున్నా. ఇందులో కత్రినా కొత్త అవతార్‌ని చూస్తాం’ అంటోంది ఇసాబెల్లె. భూషణ్ కుమార్, రెమో డి’సౌజాలు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘టైమ్ టు డ్యాన్స్’ ప్రాజెక్టులో వాలుస్కా డి‘సౌజా మరో కీలక పాత్రలో కనిపించనుంది.
చిత్రం..ఇసాబెల్లే కైఫ్