మంచి సినిమాకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊపిరి’ చిత్రం ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా, అర్ధవంతమైన విలువలతో ఆఖరిదాకా సాగింది. సినిమా అన్నతర్వాత వినోదమన్నా వుండాలి, విజ్ఞానమన్నా వుండాలి, సందేశమైనా వుండాలి. ఈ మూడు ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే మంచి సినిమాకు ఆదరణ వుంటుందని ఈ సినిమా నిరూపించింది’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి పతాకంపై పరమ్‌వి పొట్లూరి రూపొందించిన ఊపిరి చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. ఇంకా చిత్ర విశేషాలను తెలుపుతూ.. అర్ధవంతమైన విలువలతో రూపొందించినవారికి అభినందనలని, నాగార్జున, నాగేశ్వరరావును గుర్తుచేసేలా పోటీపడి నటించారని, క్లిష్టమైన ఈ పాత్రలో అందరికీ నచ్చేలా నటించడం గొప్ప విషయమని అన్నారు. కార్తి కూడా హుషారుగా, సహజంగా నటించిన ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులందరూ తప్పక చూడదగ్గ చిత్రమని తెలిపారు. ప్రేమ, అనురాగం, అనుబంధం వంటి అంశాలతో ఉద్వేగంగా రూపొందిన ఈ చిత్రం చూస్తే పాతరోజుల సినిమాలు గుర్తుకు వచ్చాయని, అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రావడం సంతోషదాయకమని ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఊపిరి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా చక్కగా ప్రదర్శింపబడుతోందని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోసమే ఈరోజు స్పెషల్ షో ఏర్పాటుచేశామని, సినిమా గురించి విశే్లషణ చేసినందుకు కృతజ్ఞతలని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి అన్నారు.